ఆకలి వేస్తె ఎక్కడ ఏదైనా తిని కడుపు నింపుకోవాలని అనుకుంటారు.. అదే పెద్ద పొరపాటు అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా రెస్టారెంట్ లలో వెయిట్ చెయ్యడం కన్నా ఆర్డర్ పెట్టుకొని తినడం మేలని చాలా మంది అనుకుంటారు.. అయితే కొన్ని రెస్టారెంట్ లు ఫుడ్ ను బాక్స్ లలో పెట్టి ఇస్తారు.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వచ్చే ఫుడ్ ఓ బ్లాక్ బాక్సుల్లో నీట్‌గా ప్యాక్ చేసి మనం ఇంటి ముందుకు వచ్చి చేరుతుంది. అసలు అందులో వచ్చే ఆహారంతో సమస్య కాదు ఆ బ్యాక్సుతోనే అసలు సమస్య.. మీరు రెస్టారెంట్‌లో ఆహారాన్ని ప్యాక్ తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడల్లా.. మీరు తప్పనిసరిగా ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్‌ని మీ చేతిలో పెడుతారు. అందులో చాలా రెస్టారెంట్లు ఆహారాన్ని ప్యాక్ చేసి తమ కస్టమర్‌లకు అందిస్తాయి..
అది నీటిగా ఉందని అనుకుంటారు.. అదే పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.. ప్లాస్టిక్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్లే ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్ మీ శరీరానికి, ఆరోగ్యానికి హానికరం.. బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడం కష్టం. బ్లాక్ ప్లాస్టిక్ స్వభావం కారణంగా ఇది జరుగుతుంది. ప్లాస్టిక్ రెసిన్లకు కార్బన్ బ్లాక్ పిగ్మెంట్ జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ప్లాస్టిక్‌కు నలుపు రంగు వచ్చేలా పిగ్మెంట్ పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో బ్లాక్ ప్లాస్టిక్‌ను కాల్చడం తయారు చేస్తారు. దీని వల్ల ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉందన చెబుతున్నారు..
కార్బన్ బ్లాక్ ప్లాస్టిక్‌లో పిఏహెచ్.. పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్ ఉంటుంది. దీనిని క్యాన్సర్ కారకాలుగా ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ ( ఐఏఆర్సీ) పరిగణిస్తుంది. అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. మీరు ఎప్పుడూ ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్‌లో ఆహారాన్ని తింటుంటే.. ఇప్పుడు ఈ రోజు నుంచి పూర్తిగా మానెయ్యండి.. అలా చేస్తే డబ్బులు పెట్టి మరి అనారోగ్యాన్ని కొన్నవాళ్లు అవుతారని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు ప్లాస్టిక్ వస్తువులు మంచిది కాదు.. ఇక మీరే ఆలోచించండి..