Site icon NTV Telugu

Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!

Remove Shirt Collar Stains

Remove Shirt Collar Stains

Easy Laundry Tricks: దుస్తులు ఉతకడం అనేది ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే పెద్ద టాస్క్. ఎంత ఖరీదైన వాషింగ్ మెషీన్ ఉన్నా, ఎంత మంచి డిటర్జెంట్ వాడినా.. షర్ట్ కాలర్లు, చేతుల దగ్గర ఉండే మొండి మరకలు మాత్రం అంత త్వరగా వదలవు. ఈ రోజుల్లో చాలా మంది దుస్తులు ఉతకడానికి వాషింగ్ మెషీన్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే వాషింగ్ మెషన్‌లో కూడా ఈ మొండి మరకలు త్వరగా వదలవు. అయితే ఈ చిన్న ‘సీక్రెట్’ తెలుసుకుంటే మొండి మరకలను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..

చాలా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల పైన, ముఖ్యంగా ‘వాష్ టబ్’ మూత పక్కన కొన్ని గీతలు (Lines) లేదా గరుకుగా ఉంటుంది. దీనిని మనం కేవలం డిజైన్ అనుకుంటాం. కానీ దీనిని ఒక ‘హ్యాక్’ లా వాడితే అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ముందుగా మొండి మరకలు ఉన్న కాలర్లు లేదా కఫ్స్ (చేతులు) దగ్గర కొంచెం డిటర్జెంట్ రాయాలి. తర్వాత ఆ భాగాన్ని కొద్దిగా తడిపి, మెషీన్ పైన ఉన్న ఆ గీతల (Lines) మీద పెట్టి సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ గీతల మధ్య కలిగే ఘర్షణ వల్ల లోపల పేరుకుపోయిన మురికి క్షణాల్లో వదిలిపోతుంది. పాత కాలంలో దుస్తులు ఉతకడానికి రాళ్లను వాడినట్టుగా, ఈ మెషీన్‌లోని గీతలు మనకు ఎంతో సహాయపడతాయి. అయితే మరీ గట్టిగా రుద్దకండి.. ఎందుకంటే దుస్తులు చిరిగిపోయే ప్రమాదం ఉంది, సున్నితంగా రుద్దితే సరిపోతుంది. సున్నితమైన దుస్తులు, పట్టు వస్త్రాలు లేదా డెలికేట్ బట్టలపై ఈ ప్రయోగం చేయకండి. గుర్తు ఉంచుకోండి దుస్తులు తడిపి రుద్దితేనే వాటికి ఉన్న మరకలు త్వరగా వదులుతాయి. మురికి కాలర్లను శుభ్రం చేయడానికి గతంలో 15 నిమిషాలు పట్టే పని ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో అయిపోతోంది. ఇంకెందుకు ఆలస్యం, మీ వాషింగ్ మెషీన్ పైన కూడా ఆ గీతలు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.

Exit mobile version