Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Easy Laundry Tricks: దుస్తులు ఉతకడం అనేది ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే పెద్ద టాస్క్. ఎంత ఖరీదైన వాషింగ్ మెషీన్ ఉన్నా, ఎంత మంచి డిటర్జెంట్ వాడినా.. షర్ట్ కాలర్లు, చేతుల దగ్గర ఉండే మొండి మరకలు మాత్రం అంత త్వరగా వదలవు. ఈ రోజుల్లో చాలా మంది దుస్తులు ఉతకడానికి వాషింగ్ మెషీన్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే వాషింగ్ మెషన్‌లో కూడా ఈ మొండి మరకలు త్వరగా వదలవు. అయితే ఈ చిన్న ‘సీక్రెట్’ తెలుసుకుంటే మొండి మరకలను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..
చాలా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల పైన, ముఖ్యంగా ‘వాష్ టబ్’ మూత పక్కన కొన్ని గీతలు (Lines) లేదా గరుకుగా ఉంటుంది. దీనిని మనం కేవలం డిజైన్ అనుకుంటాం. కానీ దీనిని ఒక ‘హ్యాక్’ లా వాడితే అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ముందుగా మొండి మరకలు ఉన్న కాలర్లు లేదా కఫ్స్ (చేతులు) దగ్గర కొంచెం డిటర్జెంట్ రాయాలి. తర్వాత ఆ భాగాన్ని కొద్దిగా తడిపి, మెషీన్ పైన ఉన్న ఆ గీతల (Lines) మీద పెట్టి సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ గీతల మధ్య కలిగే ఘర్షణ వల్ల లోపల పేరుకుపోయిన మురికి క్షణాల్లో వదిలిపోతుంది. పాత కాలంలో దుస్తులు ఉతకడానికి రాళ్లను వాడినట్టుగా, ఈ మెషీన్‌లోని గీతలు మనకు ఎంతో సహాయపడతాయి. అయితే మరీ గట్టిగా రుద్దకండి.. ఎందుకంటే దుస్తులు చిరిగిపోయే ప్రమాదం ఉంది, సున్నితంగా రుద్దితే సరిపోతుంది. సున్నితమైన దుస్తులు, పట్టు వస్త్రాలు లేదా డెలికేట్ బట్టలపై ఈ ప్రయోగం చేయకండి. గుర్తు ఉంచుకోండి దుస్తులు తడిపి రుద్దితేనే వాటికి ఉన్న మరకలు త్వరగా వదులుతాయి. మురికి కాలర్లను శుభ్రం చేయడానికి గతంలో 15 నిమిషాలు పట్టే పని ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో అయిపోతోంది. ఇంకెందుకు ఆలస్యం, మీ వాషింగ్ మెషీన్ పైన కూడా ఆ గీతలు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
తాజావార్తలు
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?