Site icon NTV Telugu

SHOX Value: పురుషులు స్త్రీల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారు? రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..

Shox Gene

Shox Gene

ప్రపంచవ్యాప్తంగా పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ భౌతిక వ్యత్యాసం వెనుక ఓ ప్రధాన జన్యుపరమైన కారణాన్ని కనుగొన్నారు. పెన్సిల్వేనియాలోని గీసింగర్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చిన బృందం మూడు పెద్ద ఆరోగ్య డేటాబేస్‌లను అధ్యయనం చేసింది. పురుషులు, స్త్రీల మధ్య ఎత్తు వ్యత్యాసానికి SHOX (షార్ట్-స్టేచర్ హోమియోబాక్స్) జన్యువు ప్రధాన కారణమని కనుగొంది. ఈ ఆవిష్కరణ ఎత్తు యొక్క రహస్యాన్ని ఛేదించడమే కాకుండా.. భవిష్యత్తులో లింగ ఆధారిత వ్యాధులను అర్థం చేసుకోవడంలో సహాయపడవచ్చని తెలిపింది.

READ MORE: Kannappa : కన్నప్ప మూవీపై కుట్ర.. నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన..

వాస్తవానికి.. పురుషులు, స్త్రీల మధ్య సగటు ఎత్తులో దాదాపు 5 అంగుళాల తేడా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం దాదాపు 10 లక్షల మందికి పైగా వ్యక్తుల డీఎన్‌ఏ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్” అనే అంతర్జాతీయ జర్నల్‌లో విశ్లేషణ ఫలితాలను ప్రచురించారు. పురుషులు XY క్రోమోజోమ్, స్త్రీలలో XX క్రోమోజోమ్ కలిగి ఉంటారు. ఇందులో Y క్రోమోజోమ్‌లో ఉండే SHOX అనే ప్రత్యేక జన్యువు ఎముకల పెరుగుదల, శరీర పొడవును ప్రభావితం చేస్తుంది. పురుషుల్లో XY క్రోమోజోమ్ ఉంటాయి. కానీ.. స్త్రీలలో XX క్రోమోజోమ్ మాత్రమే ఉంటాయి.

READ MORE: Rajimi Kanth : ‘కూలీ’ కోసం రజినీకాంత్ భారీ రెమ్యునరేషన్.. కెరీర్ లోనే హయ్యెస్ట్..?

ఈ SHOX జన్యువు స్త్రీలకూ ఉంటుంది కానీ, పురుషులలో ఇది మరింత చురుకుగా పనిచేస్తుంది. పురుషుల్లో Y క్రోమోజోమ్ ఉండటం వల్ల SHOX జన్యువు మరింత ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పురుషులలో ఎత్తు మరింత పెరుగుతుంది. అసలు ఈ జన్యువు పురుషుల ఎత్తులో దాదాపు 25 శాతం వృద్ధికి బాధ్యత వహిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. స్త్రీల శరీరంలో ఈ జన్యువు ఉన్నా, అది Y క్రోమోజోమ్ లో ఉండకపోవడం, లేదా దాని ప్రభావం తక్కువగా ఉండటమే కారణంగా భావిస్తున్నారు. ఎత్తును ప్రభావితం చేసే అంశాలలో జన్యుపరమైన విషయాలతో పాటు, హార్మోన్ల ప్రభావం, యుక్తవయస్సు సమయంలో శరీర అభివృద్ధి, ఎముకల సాంద్రత కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

READ MORE: How To Look Young : వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. యవ్వనంగా కనిపిస్తారు..!

Exit mobile version