Site icon NTV Telugu

Love And Brain: ప్రేమిస్తే మెదడులో రసాయన మార్పులు .. “లవ్ మ్యాజిక్” వెనక సైన్స్ ఇదే..

Love

Love

Love And Brain: ప్రేమ గురించి తెలియాలంటే, ప్రేమలో పడిన వారిని అడగాలి. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందనేది. లవ్ బర్డ్స్ మన లోకంలో లేని విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ప్రేమ మాయ అని అంతా అనుకుంటారు. కానీ, దీని వెనక పెద్ద రసాయన మార్పులే ఉంటాయని సైన్స్ చెబుతోంది. మన మెదడులోని కొన్ని హార్మోన్లు ‘‘లవ్’’ అనే భావన మరింత పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.

* మీరు ఎవరినైనా ఇష్టపడటం ప్రారంభించినటప్పుడు మీ మెదుడలో రివార్డ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. అకస్మాత్తుగా ఆ వ్యక్తి చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు. కొన్ని సార్లు నిద్ర, ఆహారం కన్నా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తారు.

* మొత్తం ఈ లవ్ ఎపిసోడ్‌లో ‘‘డోపమైన్’’ అనేది కీలకంగా మారుతంది. ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఆనందంతో ముడిపడి ఉన్న హార్మోన్ ఇది. మీరు ఇష్టపడిన వ్యక్తిని చూడటం, ఆలోచించడం కొంచెం సంతోషకరంగా ఉంటుంది.

* దీని తర్వాత ‘‘నోర్‌పైన్‌ఫ్రైన్’’ ఉంటుంది. ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఇష్టపడిన వ్యక్తిని చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం, అరచేతులకు చెమటలు పటట్టడం, టెన్షన్ అంతా దీని వల్లే జరుగుతాయి.

* కడిల్ హార్మోన్‌గా పిలిచే ‘‘ఆక్సిటోసిన్’’. జంట కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం వంటి శారీరక ఆప్యాయత సమయంలో విడుదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య భావోద్వేగాన్ని మరింత పెంచుతుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలను బలోపేతం చేసే హార్మోన్ కూడా ఇదే.

* మరో కీలక హార్మోన్ ‘‘సెరోటోనిన్’’ ఇది కొద్దిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది. ప్రేమ ప్రారంభ దశలో ఇది తగ్గవచ్చు. ఇది మనం ప్రేమించే వ్యక్తి గురించి ఆలోచించడం, ఫోన్‌లో మెసేజ్ చెక్ చేయడం, కారణాలు లేకుండా వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నవ్వడం వంటి వాటికి కారణం.

మూడు దశల్లో ప్రేమ..

శాస్త్రవేత్తలు తరుచుగా ప్రేమ మూడు దశల్లో జరుగుతుందని చెబుతారు. మొదట కోరిక, ఇది టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ద్వారా జరుగుతంది. ఆ తర్వాత ఆకర్షణకు డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ కారణమవుతాయి. బంధం బలపడటానికి ఆక్సిటోసిన్, ఇతర హార్మోన్లు దీనికి మద్దతుగా నిలుస్తాయి.

Exit mobile version