వేసవి కాలంలో ఎక్కువగా జ్యూస్ లలో, సోడాలను తాగుతారు.. మరికొందరు మాత్రం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా తాగుతుంటారు.. అయితే సపోటాలు కూడా సమ్మర్ లో విరివిగా లభిస్తాయి.. వీటిని జ్యూస్ గా, స్మూతిలుగా తయారు చేసుకొని తాగుతారు.. సపోటాలను షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు అస్సలు తీసుకోకూడదు.. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే డైట్ లో ఉన్నవాళ్లు కూడా అస్సలు తీసుకోకూడదు.. సమ్మర్ లో సపోటా జ్యూస్ లను ఎక్కువగా తాగడం వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సపోటాలో అనేక పోషకాలున్నాయి. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి.. అందుకే వీటిని తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు..
సపోటా లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
సపోటా జ్యూస్‌లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నివారించి ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని సపోటా అందిస్తుంది. సపోటాలో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సపోటా జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృడంగా మారుస్తుంది.. మగవారికి శక్తిని ఇస్తుంది. అలాగే సపోటాలో అధిక శాతం విటమిన్ ఏ ఉంటుంది.. కళ్ళకు చాలా మంచిది.. అదే విధంగా తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
