Site icon NTV Telugu

Salt Effects: ఉప్పు ఎక్కువగా తింటే.. ఏ అవయవాలు పాడవుతాయో తెలుసా ?

Salt

Salt

ఎంత ఖరీదైన ఫెమస్ వంటకైనా ఉప్పు సరిపోకపోతే ఆ వంట రుచిగా ఉండదువంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు మనకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉప్పు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు.. మంచిది అని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే కొన్ని అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు.. ఉప్పు ఎక్కువగా తింటే ఏ అవయవాలకు నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో నీరు తగినంత ఉండేలా చేయడంలో, నరాలు మరియు కండరాల పనితీరును మెరుగుపరచడంలో, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేయడంలో ఇలా అనేక రకాలుగా ఉప్పు మనకు దోహదపడుతుంది. ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ ఉప్పును అధికంగా తీసుకుంటే రక్త పోటు వస్తుంది..అధికంగా ఉండే రక్తపోటు గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికంగా తీసుకునే ఈ ఉప్పు మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. అంటే రాళ్లు ఏర్పడేలా చేస్తుంది..

అంతేకాదండోయ్.. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడాఉంది. అలాగే కంటిచూపు కూడా తగ్గుతుంది. దృష్టి లోపాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పును తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే క్యాల్షియం ను బయటకు పంపిస్తుంది.. అలావెళ్ళిపోతే క్యాల్షియం లోపం ఏర్పడుతుంది.. దాంతో ఎముకలు, దంతాలు సమస్యలు వస్తాయి.. అందుకే ఉప్పు అనేది రుచికి తగ్గట్లే వాడాలి.. లేకుంటే ప్రాణాలకే ముప్పు.. ఇది గుర్తుపెట్టుకోండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version