Site icon NTV Telugu

RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ ప్రమాదం వస్తుంది..

Rsv Virus

Rsv Virus

RSV virus Symptoms: శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV) కేసులు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ RSV అంటే ఏమిటి? శీతాకాలంలో ఈ కేసులు ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Man Kills Sister: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినందుకు సోదరిని చంపిన వ్యక్తి..

రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ఊపిరితిత్తులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది చాలా సాధారణం అయిన వ్యాధి అని, చాలా మంది పిల్లలు 2 ఏళ్ల వయస్సులోనే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడతారని అన్నారు. ఇది పెద్దలకు కూడా సోకుతుందని, అయితే పిల్లలలో కేసులు ఎక్కువగా ఈ కేసులు కనిపిస్తాయని అన్నారు. అయితే RSV అనేది కొంత మందిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని అన్నారు. ఏడాది పొడవునా RSV కేసులు కనిపిస్తాయని, కానీ శీతాకాలంలో అవి కొద్దిగా పెరుగుతాయని డాక్టర్లు అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, RSV ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే ఈ సీజన్‌లో గాలిలో తేమ తక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఈ సీజన్‌లో విటమిన్ డి లోపం కూడా వైరస్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు.

చాలా RSV కేసులు పిల్లలలో సంభవిస్తాయని, అయితే ఈ వైరస్ కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుందని, గరిష్టంగా రెండు వారాల్లో ఈ వైరస్ తగ్గిపోతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో, దాని లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చని, నిరంతర దగ్గు, వేగంగా శ్వాస తీసుకోవడం లేదా గురక వస్తే, మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పారు. ఈ వ్యాధి నుంచి రక్షించుకోడానికి చల్లని గాలి నుంచి పిల్లలను రక్షించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

RSV ప్రారంభ లక్షణాలు ఇవే..

* చలిగా ఉండటం.

* తీవ్రమైన శరీర నొప్పి

* గొంతు నొప్పి

* ముక్కు కారటం

* తేలికపాటి జ్వరం

* వేగంగా శ్వాస తీసుకోవడం, మూసుకుపోవడం లేదా నిరంతర ముక్కు కారడం

READ ALSO: RIL Share Price: మరో రికార్డు సృష్టించిన ముఖేష్ అంబానీ కంపెనీ.. రూ. 21 లక్షల కోట్లు దాటిన RIL మార్కెట్ వాల్యూ

Exit mobile version