Site icon NTV Telugu

Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..

Health News: మన బంధువులు లేదా మన చుట్టుపక్కల ఉన్న వారిలో కొందరికి ఉన్నట్లుండి ‘‘స్వీట్స్’’ లేదా ఏదైనా తీపి పదార్థాలు తినాలనే కోరికపుడుతుంది. ముఖ్యంగా, భోజనం తర్వాత చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది. కొందరు ఒత్తిడి లోనైనా, అలసిపోయిన సందర్భాల్లో కూడా ఇలా స్వీట్లను తింటుంటారు. అయితే, వీటిని వెనక సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర తినడం వెనక స్వీయ నియంత్రణ లేకపోవడం అని అనుకుంటాము కానీ అది పూర్తిగా నిజం కాదు. స్వీట్లు తినాలనే కోరిక జీవసంబంధమైన, ప్రవర్తనా, పర్యావరణ కారణాల కలయిక వల్ల ప్రభావితం అవుతుందని నిపుణులు చెబున్నారు.

రక్తంలో షుగర్ లెవల్స్ కారణం:

చక్కెర పదార్థాలు తినాలనే కోరిక వెనక ముఖ్యకారణాల్లో శరీరంలో షుగర్ లెవర్స్ హఠాత్తుగా పెరిగి, హఠాత్తుగా తగ్గడం ఉంటుంది. మనం వైట్ రైస్, బ్రేడ్ లేదా స్వీట్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ వెంటనే ఇన్సులిన్ పనిచేయడంతో హఠాత్తుగా పడిపోతాయి. ఇలా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, శరీరం తక్షణ శక్తి కోసం మళ్లీ తీపి పదార్థాలను కోరుకుంటుంది.

బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్:

స్వీట్స్ తిన్నప్పుడు మన మెదడులో ‘‘డోపమైన్’’ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు ఆనందాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు మన మెదడు ఆ పాత అనుభూతి కోసం మళ్లీ తీపిని కోరుకుంటుంది. గతంలో మనం ఏం తింటే హ్యాపీగా ఉన్నామనే విషయాలను మెదడు గుర్తుంచుకుంటుంది. దీని వల్ల స్వీట్లు తినాలని మనకు చెబుతుంది.

హర్మోన్ల ప్రభావం:

నిద్ర సరిగా లేకపోయినా లేదా అధిక ఒత్తిడికి గురైనా ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని వల్ల శరీరంలో ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని కోరుకుంటుంది.

ఎలా నియంత్రించాలి.?

భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల లాభాల కన్నా నష్టాలే అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం వల్ల గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. దీనిని ఇన్సులిన్ కంట్రోల్ చేస్తుంది. అయితే, మళ్లీ స్వీట్స్ తింటే ఇన్సులిన్‌పై భారం పడుతుంది.

ఇలాంటి పరిస్థితి రావద్దంటే భోజనంలో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా, ప్రొటీన్స్, ఫైబర్ ఉండే ఆహారాన్ని జత చేయాలి. ఆరోగ్యవంతమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణక్రియను నెమ్మది చేసి, రక్తంలో షుగర్ స్పైక్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉండే హర్మోన్లు సమతుల్యంగా ఉండీ, అనవసరమైన ఆకలి ఉండదు. స్ట్రైస్ వల్ల కలిగే ‘ఎమోషనల్ ఈటింగ్’ను అదుపు చేయడానికి వ్యాయామం, రిలాక్సేషన్ పద్ధతులు అవసరం. ఒక్కోసారి దాహం వేసినప్పుడు కూడా ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని తగినంత నీటిని తీసుకోవాలి.

Exit mobile version