Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- జొన్నలు, అవిసగింజలు, వివిధ సీడ్స్, డ్రై ఫ్రూట్స్‌తో ప్రోటీన్ రిచ్ లడ్డు..
- తీపి కోసం బెల్లం ఉపయోగించడం వల్ల రుచితో పాటు పోషక విలువలు కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Dry Fruits Laddu: జొన్నలను బేస్‌గా తీసుకుని.. అవిసగింజలు, వివిధ సీడ్స్, డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీ లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇవి అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటి లేదా రెండు లడ్డూలు తినడం సరిపోతుంది. మరి ఈ ప్రోటీన్ రిచ్ లడ్డును ఎలా చేసాయిలో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* జొన్నలు – 200 గ్రా.
* అవిసగింజలు (ఫ్లాక్స్ సీడ్స్) – 100 గ్రా.
* వాటర్మెలన్ సీడ్స్ – 100 గ్రా.
* కర్బూజా సీడ్స్ – 100 గ్రా.
* సన్‌ఫ్లవర్ సీడ్స్ – 100 గ్రా.
* పంప్కిన్ సీడ్స్ – 100 గ్రా.
* వాల్నట్స్ – 100 గ్రా.
* బాదాం – 100 గ్రా.
* జీడిపప్పు – 50 గ్రా.
* బ్లాక్ కిస్మిస్ – 30 గ్రా.
* నెయ్యి – తగినంత
* బెల్లం – 200 గ్రా.
Also Read
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
- Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
- Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
తయారీ విధానం:
మొదటగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో జొన్నలు వేయండి. నెయ్యి లేదా ఆయిల్ ఏమీ వేయకుండా దోరగా వేయించుకోండి. కలర్ మారితే, ఒకటి రెండు నోట్లో వేసి చూస్తే వేగాయని అర్థమవుతుంది. ఆయిల్ వేస్తే పాప్‌కార్న్‌లా అయిపోతాయి. కాబట్టి డ్రైగా వేయించడం మంచిది. వేగిన తర్వాత గిన్నెలోకి తీసేయండి.
ఆ తర్వాత అదే పాన్‌లో నెయ్యి వేసుకొని.. ముందుగా బాదాం వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత జీడిపప్పు, వాల్నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, అవిసగింజలు వేసి దోరగా వేయించుకోండి. కలర్ మారి చిటపటలాడేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. చివర్లో బ్లాక్ కిస్మిస్ వేయండి. ఇప్పుడు వేగిన జొన్నలు, డ్రై ఫ్రూట్స్-సీడ్స్ మిశ్రమం, బెల్లం అన్నీ కలిపి ఒకేసారి గిన్నెలో వేయండి.
వీటన్నిటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఒకేసారి అన్నీ వేయకుండా కొంచెం కొంచెంగా వేసి, మధ్యలో కలుపుతూ చేయండి. పూర్తిగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కొంచెం మెత్తగా ఉండేలా చేయండి. చల్లబడితే లడ్డు కట్టడం కష్టం కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చేయాలి. పిండిని బాగా కలిపి.. మీడియం సైజులో లడ్డూలు చుట్టుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువైతే ఎక్కువ జిగటగా ఉంటుంది.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!