చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.ఆరేళ్ల వరకు పిల్లల మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుంది. వారి స్వచ్ఛమైన మనసు తల్లిదండ్రులు, సమాజం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది. అలాగే అనేక కొత్త విషయాలు, కొత్త పనులు, మాటలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు వారి పెంపకం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మాట తీరు, వాతావరణం పిల్లలకి అనుగుణంగా ఉండాలి. ఇక 6 నుంచి 7 ఏళ్ల లోపు పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు కొన్ని ఉన్నాయి అవి ఎంటో చూద్దాం..
* ఒక్కపుడు మా వంశంలో మొత్తం 10 మంది అన్నదమ్ములం, మా బలగం చాలా పెద్దది, మాది ఉమ్మడి కుటుంబం అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్కరు లేదా ఇద్దరు, ఎక్కడో ముగ్గురు పిల్లలను మాత్రమే కంటున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే. మీ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకోకండి. తమ బిడ్డ ఇంకా చిన్నవాడని, అతను ఈ విషయాలను ఇంకా అర్థం చేసుకోలేడని అనుకుంటారు. కానీ పిల్లలకు మొత్తం విషయం అర్థం కాకపోయినా, అతని తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి డబ్బు కొరత ఉందని అర్ధమవుతుంది. దీంతో వారు ఇప్పటి నుండే ఒత్తిడికి గురవుతుంటారు. సో ఎంత కష్టం వచ్చిన మీ పిల్లల ముందు మాత్రం డబ్బు గురించి మాట్లాడుకోకండి.
* మీకు జరిగిన అవమానాలు , గొడవల గురించి మీ పిల్లల ముందు ప్రస్తావించకండి. అలాగే భార్య భర్తల మధ్య ఎన్ని కలతలు ఉన్న పిల్లల వరకు మీ విషయాలు తీసుకురాకండి, ముఖ్యంగా వారి ముందు గట్టి గట్టిగా అరవడం, గొడవ పడటం లాంటిది చేస్తే మీ పిల్లలు మెంటల్ చాలా డిస్టప్ అవుతారు. ఎందుకంటే పిల్లలకు అమ్మ నాన్న అంటే ఒక ఎమోషన్. అది బ్రేక్ అవుతుంది అంటే వారు మనసుకి తీసుకోలేరు. తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరు లేక పోయిన పిల్లల ఎదుగుదల పై చాలా ప్రభావం పడుతుంది. కనుక మీ మధ్య ఎన్ని కొట్లాటలు ఉన్న మీ పిల్లల కోసం సర్దుకు పోవడం మంచిది.
* సాదరణంగా కొంత మంది పిల్లలు అమ్మ ఎత్తుకుంటేనో, పక్కన పడుకుంటేనో, కథలు, పాటలు పాడితే తప్ప నిద్రపోరు. వారికి తినిపించడం, నిద్రపుచ్చడం కొంచం కష్టం. అయితే కొంత మంది తల్లులు బయపెట్టి పడుకొపెడతారు, దయం వస్తుంది బూతం వస్తుంది అని చెప్పి నిద్రపుచ్చుతారు. అది పిల్లలకి మంచిది కాదు. ఇవన్నీ పిల్లల మనస్సులో భయాన్ని సృష్టిస్తాయి, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
* కొంత మంది తల్లిదండ్రులు పిల్లల స్కూల్ టీచర్ల గురించి సరదాగా మాట్లాడుతారు. కానీ అది తప్పు వారి ముందు టీచర్ల గురించి, చదువు గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే మీ మాటలు వింటే పిల్లల మనస్సులో ప్రతికూల భావన మొదలవుతుంది. దీంతో వారికి చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. కనుక మీ పిల్లల ముందు చదువు, ఉపాధ్యాయులకు పూర్తి గౌరవం ఇవ్వండి. అలాగే మీ పిల్లలు చదువులో వెనకపడుతుంటే కనుక వారిని ఉత్సాహ పరచండి. కానీ తిట్టడం, కొట్టడం, వారి ముందు వేరే పిల్లలను పొగడటం లాంటిది చేయకండి. ఇలా చేస్తే పిల్లలు ఇంకా డల్ అవుతారు.
* ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాత ఇలా పెద్ద వలకి పిల్లలు తోందరగా దగ్గరైపోతారు. ఎందుకంటే ముసలి వారు ఎంతో జీవితం చూసి ఉంటారు. వారు చెప్పే విషయాలకు పిల్లలు తొందరగా కనెక్ట్ అవుతారు. కనుక ఇంట్లో పిల్లల ముందు పెద్ద వారితో మీరు గౌరవంగా ఉండాలి. తమ తల్లిదండ్రులను చూసే పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. కనుక మీరు అందరితో ప్రేమగా ఉంటే మీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు.