బొప్పాయి అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు.. తియ్యగా ఉంటుంది . వీటితో జ్యూస్లను , సలాడ్స్ , స్మూతీలను , కేక్ , ఐస్ క్రీమ్ లను ఇలా ఎన్నో రకాల డిష్ అలను చేసుకోవచ్చు.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. కేవలం బొప్పాయితో మాత్రమే కాదు వీటి పాలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. అవేంటో ఒకసారి చూసేద్దాం..
బొప్పాయి పాలను తీసుకోవడం వల్ల నోరు పొక్కుతుందని , ప్రేగులు పాడవుతాయని ఇలా రకరకాలుగా చెబుతారు. కానీ వీటిని తీసుకోవడం వాళ్ళ ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చెయ్యవచ్చనని నిపుణులు చెబుతున్నారు.. వీటిని రబ్బర్ పాలు అని పిలుస్తారట .. అలాగే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ పపైన్ అంటారు. ఔషధ గుణాలు కలిగిన ఈ పాలను తీసుకోవడం వల్ల కడుపులో మంట, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయట.
ఈ పాలల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి, విటమిన్ ఇ, ఫొలేట్, పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉన్నాయి. డైటరీ ఫైబర్ అనేది జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు వీటిని తీసుకోవడం మంచిది.. కొంతమందికి బొప్పాయి అంటే పడదు అలాంటి వాళ్ళు డాక్టర్ల సలహా తీసుకొని తీసుకోవడం మంచిది.. అలాగే గర్భిణీలు కూడా తీసుకోకపోవడమే మంచిది… బొప్పాయిని తీసుకున్న మంచిది.. ఏదైనా లిమిట్ గానే తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
