Vegetables And Fruits: కూరగాయలు, పండ్లు వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఇలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లలో విలువైన పోషకాలు ఉంటాయని ఎవరికైనా తెలుసా.. ఒక్కో రంగుకు ఒక్కో బెనిఫిట్ ఉంటుందంట మరీ.. అదేంటీ కూరగాయలు, పండ్లకు రంగులను బట్టి పోషకాలు ఉంటాయా? అదేంటీ అనుకుంటున్నారా.. అవునంటా.. ఏ రంగు కూరగాయ, పండులో ఎలాంటి పోషకాలు, బెనిఫిట్స్ ఉంటాయో చూద్ధాం. ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైటోకెమికల్స్‌ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.. అవేంటంటే…
Read also: Priya Prakash: నీ కళ్లల్లో ఉందో మైకం…
ఆకుపచ్చ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ కూరగాయల్లో సొర, బీర, బెండకాయలతో పాటు.. జామ, అవకాడొ, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి. పర్పుల్, నీలం రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం ద్వరా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్‌రూట్ తినాలి. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను తింటే గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి కావాలంటే రెడ్ క్యాప్సికం, టమాటా, పండు మిరప, చెర్రీ తినాలి.
Read also: VIDEO : ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారంటే దానికి కారణం రాకేష్ మాస్టర్
పసుపు, నారింజ రంగు కూరగాయలు, పండ్లను తింటే కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలని సూచిస్తున్నారు. ఇక తెలుపు, గోధుమ రంగులోని కూరగాయలు, పండ్లు తింటే పెద్దపేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఈ బెనిఫిట్స్ పొందాలంటే… వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి. అంటే ఇకపై మనకు మన శరీరంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అటువంటి కూరగాయలు, పండ్లను తింటే మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకో గలము. కాబట్టి ఇకపై మీరు తినే కూరగాయలు, పండ్లలో ఏమేమీ బెనిఫిట్స్ ఉంటున్నాయో చూసుకొని తింటే బాగుంటుంది కదా..