NTV Telugu Site icon

Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?

Noodles Amlet

Noodles Amlet

పిల్లలు హెల్తీ ఫుడ్ కన్నా కూడా నోటికి రుచిగా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. అందులో నూడిల్స్ కూడా ఒకటి..నూడుల్స్ మరియు ఆమ్లెట్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.. చాలా చాలా రుచిగా ఉంటాయి.. అంతేకాదు ఈ ఆమ్లెట్ ను ఒక్కటి తింటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాగే ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

నీళ్లు – 200 ఎమ్ ఎల్,

మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ – 1 ( చిన్నది),

చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టీస్పూన్స్,

క్యారెట్ తురుము- 2 టీ స్పూన్స్,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా…

ఆమ్లెట్ కోసం :

కోడిగుడ్లు – 2,

చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,

చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2,

క్యారెట్ తురుము -ఒక టీ స్పూన్,

పసుపు – అర టీ స్పూన్,

ఉప్పు – తగినంత,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా..

తయారీ విధానం..

ముందుగా నూడిల్స్ ను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి..తరువాత ఇందులో ఉండే మసాలా పొడిని కూడా వేసి కలపాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. నూడుల్స్ ఉడికిన తరువాత క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మూత పెట్టి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో కోడిగుడ్లను వేసుకోవాలి..ఇప్పుడు ఆమ్లెట్ ను తయారు చేసుకోవాలి..ఆమ్లెట్ ను నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.. ఇక ఆ ఆమ్లెట్ పై నూడుల్స్ ను వేసుకోవాలి. ఈ నూడుల్స్ ను ఆమ్లెట్ సగానికి వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఆమ్లెట్ ను సగానికి మడిచి మరో రెండు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ నూడుల్స్ తయారవుతాయి.. పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఇష్టంగా తింటారు.. వర్షకాలంలో ఇలా స్నాక్స్ చేసుకొని తినండి..