NTV Telugu Site icon

Nerve Burning : చేతులు, కాళ్లకు నరాల మంటలు వస్తున్నాయా? ఇదే కారణం కావొచ్చు..

Nerve Burning

Nerve Burning

చాలామందికి కాళ్లు, చేతుల్లో ఉండే నరాలు మంటగా ఉంటున్నాయి అంటున్నారు..ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి… ఈ వ్యాధినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతినడం వల్ల నరాల మంటలు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అసలు ఎందుకు ఇలా వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శరీరంలో విటమిన్ బి12 లోపించడం వల్ల కూడా నరాలు దెబ్బతింటాయి. నరాలపై ఉండే కవచం తయారవ్వాలంటే మనకు విటమిన్ బి 12 అవసరమవుతుంది. ఈ విటమిన్ లోపించడం వల్ల నరాలపై కవచం సరిగ్గా తయారవ్వక నరాలు దెబ్బతింటాయి. అదే విధంగా సయాటికా నరం ఒత్తిడికి గురి అవ్వడం వల్ల కూడా అరికాళ్లల్లో, అర చేతుల్లో మంట వస్తుంది.. షుగర్ ఉన్నా కూడా నరాల్లో ఇలాగే మంటలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల కూడా పాదాలల్లో వస్తాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల పాదాలకు రక్తప్రసరణ సాఫీగా సాగక పాదాల్లో మంటలు వస్తాయి. అలాగే హెచ్ఐవి తో బాధపడే వారిలో కూడా నరాల్లో మంటలు వస్తాయి. ఇక కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా నరాల్లో మంటలకు దారి తీస్తాయి..

ఇకపోతే నరాలకు సంబందించిన వ్యాదులు, మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మంటలు వస్తాయట..ఇలా పాదాల్లో మంటలతో బాధపడే వారు ముందుగా వైద్యున్ని సంప్రదించి ఏ కారణం చేత ఈ సమస్య వచ్చింతో తెలుసుకోవాలి. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు ముందుగా నొప్పి, మంట తగ్గడానికి గట్టిగా ఉండే చెప్పులు కాకుండా మెత్తగా ఉండే ఆర్థో చెప్పులను వాడాలి. అలాగే రోజూ 15 నుండి 20 నిమిషాలపాటు పాదాలను చల్లటి నీటిలో ఉంచాలి.. అలాగే పడుకొనే ముందు పాదాల కింద దిండును పెట్టుకోవడం మంచిది..వారానికి రెండు సార్లు పుట్టగొడుగులను తీసుకోవాలి. డయాబెటిస్ తో బాధపడే వారు డయాబెటిస్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ముందు డాక్టర్ ను సంప్రదించాలి..

Show comments