ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అత్యంత భక్తి పూర్వకంగా జరుపుతూ, నాగ దేవతకు ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు. ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 25 కి అంటే ఈ రోజు వచ్చింది. సనాతన విశ్వాసాల ప్రకారం, ఈ రోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం, ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్మకం. పూజా విధానంలో మొదటగా..
పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతను నమస్కరించడం ప్రధానం. పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి, వ్రతాన్ని ప్రారంభిస్తారు. వ్రతం చేసేటప్పుడు పూర్తి ఉపవాసం పాటించడం తప్పనిసరి. ఈ రోజున వేడి లేదా వండిన పదార్థాలు, కూరగాయలు, మసాలా దారి వంట చేసినవి తినకూడదు. కేవలం పండ్లు, చలిమిడి, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు మాత్రమే తీసుకోవాలి. వ్రతం సమయంలో పగలు నిద్రపోవద్దు. మరో ముఖ్యమైన నియమం, ఉపవాసం ముగిసిన తర్వాత తలారా స్నానం చేసి, తిరిగి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నమస్కరించుకుని ఇంటికి చేరి ఉపవాసం పూర్తి చేయాలి.
ప్రజల నమ్మకం ప్రకారం, ఈ విధంగా పూజ చేసే వారికి సంతానం కలుగుతుంది. అంతే కాకుండా నాగ దోషం, రాహు తు దోషాలు, ఇతర అనర్థక ప్రభావాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈ రోజు పాటించే పూజ మరియు నియమాలు సంపూర్ణంగా పాటించటం ద్వారా కుటుంబంలో శాంతి, ఐక్యత, సుఖ సంతోషం పెరుగుతుందని విశ్వసనీయంగా భావించబడుతుంది. కాబట్టి సంతానం కోరిక ఉన్న జంటలు నాగుల చవితి సందర్భంగా ఈ పూజను చేసుకోవడం చాలా ఫలదాయకమని తెలుసుకోవాలి.
