
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ ధరిస్తున్నా వైరస్ సోకుతూనే ఉన్నది. కరోనా మొదటి దశలో సింగిల్ మాస్క్ ధరించినా సరిపోయిందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ భీభత్సంగా ఉండటంతో తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని చెప్తున్నారు. లోపల సర్జికల్ మాస్క్ దానిమీద గుడ్డతో తయారు చేసిన మాస్క్ ధరించడం ఉత్తమం అని, సర్జికల్ మాస్క్ ను తీసేసిన తరువాత మరోసారి ఆ మాస్క్ ను ఉపయోగించకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం తుమ్మడం, తగ్గడం వలన మాత్రమే కాకుండా, గుడ్డిగా మాట్లాడటం, అరవడం, గొంతెత్తి పాడటం ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.