Site icon NTV Telugu

Morning Headache Causes: నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుందా.. ఎందుకో తెలుసా!

Morning Headache Causes

Morning Headache Causes

Morning Headache Causes: చాలా మందికి నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుంది. నిజానికి ఈ నొప్పిని తేలిక పాటిది కాదని, కొన్నిసార్లు ఇది రోజంతా మనిషిని ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే దీనిని విస్మరించకూడదని, ఎందుకంటే దీని వెనుక అనారోగ్య సమస్యలు దాగి ఉంటాయని చెబుతున్నారు. చల్లని వాతావరణం కారణంగా రక్త ప్రసరణను నెమ్మదిస్తుందని, దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరదని తెలిపారు. దీంతో పాటు రోజువారీ ఆహారంలో పోషకాలు తక్కువగా ఉంటే ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి సమస్య వేధిస్తుందని వెల్లడించారు.

READ ALSO: Egg Nutrition Facts: కోడి గుడ్లు తినే అలవాటు ఉందా? ఇది మీ కోసమే..

తలనొప్పి ఎందుకు వస్తుంది..
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఉదయం వేళల్లో తలనొప్పి రావడానికి ప్రధాన కారణం ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం అని వివరించారు. మెగ్నీషియం లోపం వల్ల నరాలు ఒత్తిడికి గురవుతాయి, దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్లు వస్తాయని వెల్లడించారు. విటమిన్లు బి2, బి12 మెదడుకు శక్తిని అందిస్తాయని, అలాగే నరాల పనితీరు సరిగ్గా ఉండటానికి సహాయపడతాయని తెలిపారు. ఈ విటమిన్ల లోపిస్తే ఉదయం నిద్రలేచినప్పుడు తల బరువుగా, నొప్పిగా అనిపిస్తుందని తెలిపారు.

చలికాలంలో ప్రజలు తరచుగా తక్కువ నీరు తాగుతారని, ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని, దీంతో మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుందన్నారు. ఇది తలనొప్పికి దారితీస్తుందని, ఇంకా ఐరన్ లోపం రక్తంలో ఆక్సిజన్ లేకపోవడానికి కారణం అవుతుందని, ఇది నిద్ర లేవగానే తల బరువుగా మారడానికి కారణం అవుతుందని వెల్లడించారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం మెదడు వాపు ప్రమాదాన్ని పెంచుతుందని, అలాగే ఇది ఉదయం తలనొప్పిని ప్రేరేపిస్తుందన్నారు. అందుకని, సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు.

ఉదయం తలనొప్పిని తగ్గించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం కోసం బాదం, గుమ్మడికాయ గింజలు, పాలకూర, అరటిపండ్లు తినాలని చెబుతున్నారు. ఇవి నరాలను సడలించి నొప్పిని తగ్గిస్తాయని, అలాగే గుడ్లు, పాలు, పెరుగు, తృణధాన్యాలు విటమిన్లు B12, B2 తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. ఇవి మెదడుకు శక్తినిస్తాయని, ఉదయం అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు.

ఐరన్ కోసం, పాలకూర, బెల్లం, శనగలు, పప్పు ధాన్యాలు తినాలని చెబుతున్నారు. ఇవి ఆరోగ్యకరమైన రక్త ఆక్సిజన్ స్థాయిలను నిర్వహిస్తాయని, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన ఎంపికలుగా పేర్కొన్నారు. ఇవి మెదడు వాపును తగ్గించడంలో, తలనొప్పిని నియంత్రించడంలో విశేషంగా సహాయపడతాయని వైద్యులు పేర్కొన్నారు. అలాగే ఉదయం సమయంలో ఉత్సాహంగా ఉండటానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలని సూచించారు.

READ ALSO: Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్

Exit mobile version