NTV Telugu Site icon

Monsoon Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తింటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..

Food

Food

బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు,. ఘాటైన మసాలాలు ఇంకా ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయని వాటికి దూరంగా ఉండటం బెస్ట్ అని చెబుతున్నారు.. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె సమస్యలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా.. పని చేయాలన్నా స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని చెప్పవచ్చు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటే హై కొలెస్ట్రాల్, హైబీపీ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి..

వర్షాకాలంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల నొప్పి నివారిణిగా పని చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటీస్, డయాబెటీస్ ఉన్న వారిలో స్పైసీ ఫుడ్ నొప్పిని తగ్గించేందుకు సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి…

అదే విధంగా ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఉప్పు, స్పైసీ ఫుడ్ తింటే గట్ లోని చెడు బ్యాక్టీరియా తగ్గించి, మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి..

స్పైసీ ఫుడ్ తింటే అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మీరు తీసుకునే ఆహారం.. జీవక్రియపై ఎఫెక్ట్ చూపిస్తాయి.. అందుకే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.