Site icon NTV Telugu

Girl’s mind: అమ్మాయిల విషయంలో పురుషులు చేసే తప్పు ఏంటో తెలుసా?

Mistakes Men Make With Girls

Mistakes Men Make With Girls

Girl’s mind: ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరు.. మాటలే కాదు.. మనసు కూడా చాలా కష్టం. ముఖ్యంగా మహిళలు కొన్ని విషయాలను చాలా తేలికగా తీసుకుంటారో, మరికొన్ని విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇలాంటి వాటి గురించి తప్పక తెలుసుకోవాలి.. చాలా మంది పురుషులు చేసే తప్పు ఏంటంటే.. ఆడవారిని అంతగా అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం చెప్పిన వినరు. దానికి తోడు వారి మాటలను వినకుండా మధ్యలోనే ఆపేస్తూ మళ్లీ మీరు వారికి సలహా ఇస్తుంటారు. అలా కాకుండా పూర్తివిని ఆ తరువాత వారికి చెప్పండి. ఆ విషయంలో కాస్త ఎడమెహం పెడమెహం వుండినా మాటలను అర్థం వచ్చినట్లు చెబితే ఇద్దరికి మంచిది.

స్త్రీలకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులపై మీరు కోప్పడితే మహిళలు ఇష్టపడరు. దీంతో వారు అసహనానికి గురై తప్పుగా ఆలోచిస్తారు. కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడి వారిపైనే ఫిర్యాదు చేయకండి. పురుషులకు ప్రధానంగా పిల్లలంటే చాలా ఇష్టపడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ పిల్లలను కనాలని ఇష్టముండదు ఇది గుర్తుంచుకోండి. కొంతకాలం హ్యాపీగా వుండాలని, ఒకరినొకరు ఆనందంగా గడపాలని స్ర్తీలు ఆలోచిస్తుంటారు. కానీ దీనిని పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. పురుషుల కంటే స్త్రీలు దుస్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని ఇష్టపడటం మాత్రమే కాదు. ఒక్కో డ్రెస్‌కి ఒక్కో కథ ఉంటుంది. అది వారికి సంబంధించిన సెంటిమెంట్. కానీ, స్త్రీలు బిగుతుగా ముఖ్యంగా, బ్రా. బ్రాలెస్‌గా ఉండటానికి ఇష్టపడతారు. మిగతావారు వేసుకుంటున్నారని, చూడ్డానికి బాగుండదని మాత్రమే స్ర్తీలు దీనిని ధరిస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాదు.. స్త్రీలు సెక్స్ విషయంలో కొత్త ఫాంటసీని కలిగి ఉంటుంది. మహిళలు తమ భాగస్వామితో రొమాన్స్ చేయాలనుకుంటారు. ఈ విషయంలో మహిళలు భిన్నంగా ఆలోచిస్తారు. పీరియడ్స్ సమయంలో స్త్రీలు అనుభవించే అసౌకర్యాలను, ముఖ్యంగా ఆ సమయంలో వారి భావోద్వేగాలను పురుషులు అర్థం చేసుకోలేరు. మహిళలు ఒంటరిగా బయటకు వెళితే తమ భద్రత గురించి ఇంట్లో పురుషులు, స్నేహితులు భయపడుతున్నారు. ఇది నిజమే కానీ మహిళలు తమకు ఇష్టమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లేందుకు ఇష్టపడతారు. పురుషులు దీన్ని పెద్దగా పట్టించుకోరు. అలాగే, కాస్త పర్సనల్. నీ పర్సనల్‌ నాలో పంచుకోకూడదా అంటే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో చెప్పే మాటలే కానీ, కొన్ని చెప్పుకోవడానికి మరికొన్ని అవి వింటే మీరు ఎక్కడ దూరమౌతారో అనే భావన కూడా అమ్మాయిలలో ఉంటుంది. మరో విషయం ఏంటంటే వారి కుంటుంబంలో ఎప్పుడు ఫ్రీ లైఫ్ కి అలవాటు పడిన అమ్మాయిలు ఒక్క సారి వారి లైఫ్‌ లో వచ్చే అబ్బాయి గురించి ఆలోచించాలంటే చాలా కష్టం. వారి మాటలు వారి బిహేవియర్‌ కనుక్కోవడం మంటే అది సహనంతో కూడిన పని. వారి మాటలు అర్థం చేసుకుంటే జీవితాంతం ఆనందంగా గడపచ్చు. కాస్త సహనంతో ఆలోచించండి.. అర్థం చేసుకుని జీవితాన్ని గడపండి.
Karimnagar : కరీంనగర్ లో విషాదం.. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఆత్మహత్యలు

Exit mobile version