యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి గురించే ఆలోచిస్తారు.. ఎన్నెన్నో కలలు కంటారు.. పెళ్లి చేసుకోవాలంటే ఇరు కుటుంబాలు ఒకరినొకరు బాగా తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.. అంతేకాకుండా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. అందుకే అమ్మాయిలు అబ్బాయిలు ఎన్నో సంబంధాలు చూసి ఏరి కోరి మరి భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని, కష్టం, సుఖం, సంతోషంలో అన్నింటా తనతో కలసి నడవాలని ఆరాటపడతారు. కుటుంబంలో సంతోషాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా ఒకరికొకరు అండగా నిలవాలనుకుంటారు..
స్త్రీలు కన్నవారిని పుట్టింటి వారిని అప్పటివరకు అనగా 20 ఏళ్ల వరకు ఉన్న ప్రపంచాన్ని విడిచిపెట్టి మరొక ప్రపంచానికి వెళుతూ ఉంటారు. అటువంటి పెళ్లి విషయంలో తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలి. అందుకే పెళ్లిచేసుకునే ముందే అమ్మాయిలో ఈ నాలుగు లక్షణాలను గమనించాలని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి లక్షణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అందాన్ని చూసి కాకుండా మాట్లాడేవిధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం. ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓర్పు సహనం మనిషిని చూడగానే అర్థమవుతాయా ఏంటి అని అడగొచ్చు. నిజమే కానీ మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరుని బట్టి ఆ వ్యక్తికి సహనం, ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చు.. సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అన్నీ పాటించేస్తారని కాదు .పెరిగిన వాతావరణం ప్రబావం కొంతైనా ఉంటుంది. కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు ఎవ్వరికైనా ప్రధమ శత్రువు. తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే చెప్పలేదు. మీ జీవితంలో ని అమ్మాయిని ఆహ్వానిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించాలి.. ఇలాంటి విషయాలను గమంచి మరీ పెళ్లి చేసుకోవడం మంచిది..
