S*exual drive Study: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల వయసులోనే ఎక్కువగా ఉంటాయనే భావన ఉంది. కానీ తాజాగా వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ ఆలోచనకు భిన్నమైన నిజాన్ని వెల్లడించింది. పురుషులలో ఈ కోరికలు వయసుతో కాకుండా శారీరక-మానసిక పరిపక్వతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయని ఈ స్టడీ చెబుతోంది. ముఖ్యంగా నలభయ్యేళ్ల వయసులో పురుషుల సెక్స్ డ్రైవ్ అత్యున్నత స్థాయికి చేరుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎస్టోనియాలోని టార్టూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 20 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న 67 వేల మందికిపైగా డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో పురుషులలో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల వయసులో క్రమంగా పెరిగి, నలభయ్యేళ్ల ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత మెల్లగా తగ్గుతాయని నివేదిక తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అరవయ్యేళ్ల వయసున్న పురుషులు కూడా శృంగార కోరికల విషయంలో ఇరవయ్యేళ్ల యువకుల్లా మారిపోతారట.
READ MORE: How To Earn ₹1 Crore: కోటి రూపాయలు సంపాదించడానికి సింపుల్‌గా ఇలా చేయండి…
కాగా.. మహిళల విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. మహిళల్లో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల చివరి నుంచి ముప్పయ్యేళ్ల వయసు వరకు ఎక్కువగా ఉంటాయని స్టడీ తెలిపింది. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వెళ్తాయి. ముఖ్యంగా యాభయ్యేళ్ల తర్వాత ఈ తగ్గుదల వేగంగా కనిపించింది. మొత్తంగా వృద్ధుల జీవితకాలాన్ని పరిశీలిస్తే.. చాలా సందర్భాల్లో వృద్ధ పురుషుల్లో ఈ కోరికలు మహిళల కంటే అధికంగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఆశ్చర్యకరమైనవని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు శృంగార కోరికలకు శారీరక ఆరోగ్యం, హార్మోన్లు, సంతానోత్పత్తి సామర్థ్యమే కారణమని భావించారు. నిజానికి పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి ముప్పయ్యేళ్ల ప్రారంభం నుంచే తగ్గడం మొదలవుతుంది. అయినప్పటికీ శృంగార కోరికలు నలభయ్యేళ్ల వరకు పెరుగుతూనే ఉంటాయని ఈ అధ్యయనం ద్వారా బయటపడింది.
