Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Family: అదృష్టమంటే ఇదే. ‘దేవుడున్నాడు’ అనే సెంటిమెంట్ డైలాగ్ అందరి నోటా ఆటోమేటిగ్గా వచ్చే సందర్భం. ఓ కుటుంబం అప్పుల బాధ పడలేక ఉన్న ఇంటిని ఉన్నపళంగా అమ్ముకొని అద్దె ఇంట్లోకి మారాల్సిన పరిస్థితి. బేరం కూడా కుదిరింది. బేరగాడు సాయంత్రం వచ్చి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఎనిమిది నెలల కిందటే ఆ ఇంటిని ఎన్నో ఆశలతో కట్టుకున్నారు. బ్యాంకు నుంచి రూ.10 లక్షలు, బంధువుల నుంచి రూ.20 లక్షలు తీసుకొని సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. కానీ ఆ ఫ్యామిలీకి సంపాదన తక్కువ. నాలుగు నెలల నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఆ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు ఉన్నారు. ఇద్దరమ్మాయిల పెళ్లిళ్లు చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు ఇంటర్ చదువుతున్నారు. కొడుకు ఈమధ్యే ఖతార్‌లో చిన్న ఉద్యోగంలో చేరాడు. రోజువారీగా ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. చేసేదేమీ లేక దేవుడి మీద భారం వేశాడు. అమ్ముకోవటానికి వేరే ఆస్తులు కూడా ఏమీలేవు. దీంతో అదృష్టాన్నే నమ్ముకున్నారు. నాలుగు నెలల నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఆ లాటరీ తమకు తగలకపోతుందా, అప్పుల నుంచి బయటపడకపోతామా అనే ఆశావహ దృక్పథంతో ఉన్నారు.
Also Read
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
read also: Interesting News: హైవే పక్కన హైఫై టాయిలెట్ కట్టించటం కోసం.. ఉద్యోగానికి సైతం గుడ్‌బై..
కానీ మూడు నెలల నుంచి నిరాశే ఎదురవుతోంది. వేరే గత్యంతరంలేక ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయానికొచ్చారు. వాళ్లు తీర్చాల్చిన మొత్తం అప్పు రూ.45 లక్షలు. కానీ ఇంటిని రూ.40 లక్షలకే అడుగుతున్నారు. బేరం కుదరట్లేదని కొద్ది రోజులు ఆగారు. కానీ అప్పులవాళ్లు ఆగట్లేదు. డబ్బులు ఇవ్వాలంటూ పదే పదే అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంతో కొంతకి ఇల్లు అమ్మేద్దామనుకొని చివరిసారిగా బేరం కుదుర్చుకున్నారు. ఇల్లు కొనే వ్యక్తి ఆ రోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇంటి యజమాని మధ్యాహ్నం బయటికి వెళ్లి మరోసారి ఫిఫ్టీ-ఫిఫ్టీ లాటరీ టికెట్లు కొన్నాడు. మళ్లీ అదే ఆశ.
లాటరీ తగలకపోతుందా? డబ్బు రాకపోతుందా? అని ఎదురుచూశాడు. మూడు గంటలకు ఫోన్ వచ్చింది. మీకు లాటరీ తగిలిందని చెప్పారు. ఆ లాటరీ విలువ ఏకంగా కోటి రూపాయలు కావటం విశేషం. ట్యాక్స్‌లన్నీ పోను రూ.63 లక్షల వరకు వచ్చాయి. మొత్తానికి ఇంటిని నిలబెట్టుకున్నాడు. గంటల వ్యవధిలో జీవితం అనూహ్య మలుపు తిరగటాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఈ సంఘటన కేరళలో లేటెస్టుగా జరిగింది. కాసరగడ్ జిల్లాలోని మంజేశ్వర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బవా అనే ఓ పెయింటర్ రియల్ స్టోరీ ఇది. రీల్ స్టోరీలా అనిపిస్తోంది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..