కొందరు ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు.. వారి మనసులో ఒక్క విషయం కూడా దాచుకోకుండా చెప్పేస్తారు. వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది వారికి అలవాటు. ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేయరు. వేరేవారికి షేర్ చేయరు అనే నమ్మకం ఉంటుంది. అయితే, కొన్ని విషయాలు వారికి కూడా చెప్పొద్దని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*. మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని ఆడుకొనే ఛాన్స్ ను అస్సలు ఇవ్వకండి..బలహీనతలు మీ వరకూ తెలిస్తే చాలు. వాటిని కూడా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు ఫ్రెండ్స్‌కి చెప్పకపోవడమే మంచిది..
*. మీకు వచ్చే కలల గురించి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకండి.. వారికంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి పర్సనల్స్ కావొచ్చు, ప్రొఫెషనల్ కావొచ్చు. వీటిని కూడా షేర్ చేసుకోకపోవడమే మంచిది…
*. భార్యా భర్తల మధ్య ఉండే గొడవలు, సీక్రెట్స్, ఇంకేదైనా కొన్ని విషయాలను ఫ్రెండ్స్ తో చెప్పడం మంచి పద్ధతి కాదు.. ఇలా చెప్పడం వల్ల చులకనగా చూస్తారు.. వీటిని ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్‌కి చెప్పొద్దు..
*.మీ మనీ విషయాలు వీలైనంత వరకూ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోకపోవడమే మంచిది. మీ బాధ్యతల నుండి మీకు జీతం ఎంత, ఆస్తి ఎంత ఉందనేది పంచుకోకపోవడమే మంచిది. అందరూ ఒకేలా ఉండరు. అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇలాంటివి ఎప్పుడైనా చిచ్చుపెడతాయి. కాబట్టి, షేర్ చేసుకోకపోవడమే మంచిది..
*. మీకు చెప్పిన సీక్రెట్స్ వేరేవారికి చెప్పకుండా చూసుకోండి. వాటిని వారు కూడా వేరేవారికి చెబుతారని గుర్తుపెట్టుకోండి… ఇంకా రిలేషన్ షిప్ గురించి అస్సలు చెప్పకండి.. ఇవన్నీ గుర్తుంచుకోండి..
