Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- కొరియన్ అమ్మాయిలలా..
- కాంతివంతమైన, హైడ్రేటెడ్ చర్మం కోసం ఇంట్లో లభించే పదార్థాలతో కొన్ని చిట్కాలు..
- బియ్యం కడిగిన నీటిని నేచురల్ టోనర్‌లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean Glass Skin: ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరూ మెరిసే, మచ్చలు లేని అందమైన చర్మాన్ని కోరుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే కాలుష్యం, మారుతున్న జీవనశైలి, సరైన స్కిన్ కేర్ లేకపోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే మనదేశంలో చాలామంది అమ్మాయిలు కొరియన్ అమ్మాయిలలా కాంతివంతమైన, హైడ్రేటెడ్, గాజులా మెరిసే చర్మం కావాలని కోరుకుంటారు. ఇందుకోసం వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు.
అయితే కొరియన్ స్కిన్ కేర్‌లో ఖరీదైన కాస్మెటిక్స్‌తో పాటు ఇంట్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. మన భారతీయ వంటగదిలోనూ అందుబాటులో ఉండే బియ్యం, పెరుగు, తేనె, గ్రీన్ టీ వంటి పదార్థాలను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తుంటారు. అయితే వీటి ప్రభావం వ్యక్తి చర్మ స్వభావాన్ని బట్టి మారవచ్చు. మరి కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కోసం వీటిని ఎలా వాడాలో ఒకసారి చూసేద్దామా..
Also Read
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
బియ్యం కడిగిన నీటితో
కొరియాలో చాలా కాలంగా బియ్యం నీటిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. బియ్యాన్ని కడిగినప్పుడు లేదా నానబెట్టినప్పుడు అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు నీటిలోకి వస్తాయి. ఈ నీటిని ముఖానికి నేచురల్ టోనర్‌లా ఉపయోగించవచ్చు. ఆ బియ్యం నీటిని ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడుక్కోవచ్చు. అయితే దీనివల్ల రంధ్రాలు చిన్నవుతాయి. అంతేకాకుండా మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి వంటి ప్రయోజనాలకు కొన్ని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.
పెరుగు-తేనెతో మాయిశ్చరైజింగ్
పెరుగు, తేనె కలిపి తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ కూడా ఇంట్లో సులభంగా ప్రయత్నించగలిగే ఓ చిట్కా. తేనె చర్మంపై తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృత కణాలను తొలగించడంలో సహాయపడే ఓ మృదువైన ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవచ్చు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించి ఉపయోగించడం మంచిది.
గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖంపై కనిపించే తాత్కాలిక వాపు, అలసట తగ్గించుకోవడానికి చల్లటి గ్రీన్ టీ క్యూబ్స్‌ను కొందరు ఉపయోగిస్తారు. ముందుగా గ్రీన్ టీ తయారు చేసి పూర్తిగా చల్లార్చాలి. ఆ తర్వాత ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్‌ను నేరుగా ఎక్కువసేపు చర్మంపై ఉంచకుండా, పలుచని వస్త్రంలో చుట్టి కొద్దిసేపు మృదువుగా ఉపయోగించడం మంచిది. చలికి సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ పద్ధతిని స్కిప్ చేస్తే మంచింది.
గ్లోయింగ్ స్కిన్ కోసం
కేవలం ముఖానికి ప్యాక్స్, టోనర్లు ఉపయోగించడం వల్లే చర్మం ఆరోగ్యంగా మారదు. తగినంత నీరు తాగడం, పోషక విలువలు ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర పొందడం కూడా ముఖ్యమే. అలాగే బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల సూర్యరశ్మి కారణంగా చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. సరైన రోజువారీ స్కిన్ కేర్ రొటీన్ పాటించడం కూడా చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!