Site icon NTV Telugu

Eat Chapatis in the Morning: రాత్రి చేసిన చపాతీలు ఉదయం తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

Untitled Design (17)

Untitled Design (17)

చాలా మంది సౌకర్యం కోసం రాత్రి చేసిన చపాతీలను ఉదయం తింటుంటారు. రాత్రి మిగిలిపోయిన చపాతీలను వెంటనే పారేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం ఉదయం సద్దె రొట్టె (రాత్రి చేసిన చపాతీలు) తినడం ఆరోగ్యానికి కొంతమేరకు మంచిదని చెబుతారు. అయితే వాటిని సరైన విధంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. రాత్రి చేసిన చపాతీలను బయట ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా వేసవికాలంలో అవి త్వరగా పాడవుతాయి.

రాత్రి మిగిలిన చపాతీలను ఫ్రిజ్‌లో సరిగ్గా నిల్వ చేసి, ఉదయం పూర్తిగా వేడి చేసి తినడం మంచిది. చల్లగా లేదా అర్ధం వేడి చేసిన చపాతీలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసిన చపాతీలలో పోషక విలువలు తగ్గిపోతాయి. అందువల్ల వీలైనంత వరకు తాజా చపాతీలను తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాత్రి చేసిన చపాతీలను సరైన జాగ్రత్తలతో ఉదయం తీసుకోవాలి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, సరైన విధంగా నిల్వ చేసి తీసుకున్న రాత్రి చపాతీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతాయని చెబుతున్నారు. అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి, ఎందుకంటే ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, మలబద్ధకం మరియు రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వవచ్చని అంటున్నారు.

ఈ సమాచారం మొత్తం మేము ఇంటర్నెట్ ద్వారా సేకరించినది మాత్రమే. ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది కాబట్టి, ఈ సూచనలను అనుసరించే ముందు తప్పకుండా వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Exit mobile version