NTV Telugu Site icon

Sitting In Toilet : టాయిలెట్​లో ఎక్కువ సేపు గడుపుతున్నారా?

Sitting In Toilet

Sitting In Toilet

కొంత మంది ఉదయం లేవగానే టాయిలెట్‌కు వెళ్లి అరగంట వరకు బయటకు రారు. ఇక బయట ఉన్నవాళ్లకు మాత్రం వారు టాయిలెట్‌పై నిద్రిస్తున్నారా? అని సందేహిస్తుంటారు. మరి కొందరైతే ఫోన్,
న్యూస్ పేపర్లు తీసుకెళ్లి ఎక్కువ సమయం గడుపుతుంటారు ఎక్కువ సేపు కూర్చుంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే మానేయండి.. లేదంటే రోగాల బారిన పడక తప్పదు.

READ MORE: Pakistan: రగులుతున్న పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్..

టాయిలెట్​లో ఎక్కువసేపు ఫోన్​ను ఉపయోగించడం వల్ల విసర్జన అవయవాలపై అదనపు ఒత్తిడి పడుతుందని నిపుణలు వెల్లడిస్తున్నారు. ఇంకా రక్త ప్రసరణపై ప్రభావం పడి రక్త నాళాలు ఉబ్బుతాయట. ఫలితంగా ఇది పైల్స్, ఫిషర్స్​కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ప్రతి టాయిలెట్​​లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. అదే మీరు టాయిలెట్​లో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న సాల్మోనెల్లా, ఇ-కొలి వంటి బ్యాక్టీరియాల కారణంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందట.

READ MORE: Pakistan: రగులుతున్న పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్..

అయితే.. టాయిలెట్‌కి వెళ్లి వచ్చాక తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కొందరు కడుక్కోకుండా అలాగే ఆహారం తింటారు. కడుక్కున్నా.. వెంటనే అదే చేత్తో మొబైల్ ని పట్టుకుంటారు. దీంతో ఆ ఫోన్ మీద ఉన్న క్రిములు మీ చేతి మీదకు వస్తాయి. ఆ బ్యాక్టీరియా కడుపులోనికి వెళ్లి అతిసారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుందిట. ఇంకా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం కారణంగా ఇతర సమస్యలతోపాటు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉందట. అయితే.. నిపుణుల సూచన ప్రకారం.. టాయిలెట్‌​కు సుమారు 5-10 నిమిషాల సమయం మాత్రమే తీసుకోవాలి.