Site icon NTV Telugu

Honey In Hot Water: హాట్ వాటర్‌లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!

Honey In Hot Water

Honey In Hot Water

Honey In Hot Water: ప్రపంచవ్యాప్తంగా తేనెకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. చాలా దేశాల్లో తేనెను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిని ఆహారంలో భాగంగా, చర్మ సమస్యల చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తేనె చాలా కాలంగా అంతర్భాగంగా ఉంది. అలాగే వివిధ రకాల వ్యాధుల నివారణకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన తేనెలో మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ తేనెను వేడి చేయడం అనేది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.

READ ALSO: DK Shivakumar: కుల సర్వేలో ఆభరణాల ప్రశ్నకు నో చెప్పిన డీకే.శివకుమార్.. బీజేపీ రియాక్షన్ ఇదే!

తేనెను వేడి చేయడం హానికరం..
ఆయుర్వేద ఆరోగ్య కోచ్ డింపుల్ జంగ్రా ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్లో తేనెతో వంట చేయవద్దని హెచ్చరించారు. తేనెను వేడి చేయడం వల్ల మెయిలార్డ్ ప్రతిచర్య ద్వారా దాని రసాయన నిర్మాణం మారి, 5-హైడ్రాక్సీమీథైల్పర్ఫ్యూరల్ (HMF) అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. సహచరక సంహిత వంటి ఆయుర్వేద గ్రంథాలు కూడా తేనెను వేడి చేయడంపై హెచ్చరిస్తున్నాయి. తేనెను వేడి చేయడం వల్ల జీర్ణం కాని అమా అనే పదార్థం ఏర్పడుతుందని, అది శరీరంలో విషపూరితంగా మారుతుందని పేర్కొంటున్నాయి.

వేడి చేస్తే ఏమి జరుగుతుందంటే..
104°F (40°C) వంటి అధిక ఉష్ణోగ్రతలు, తేనెలోని జీర్ణక్రియకు అవసరమైన డయాస్టేస్, గ్లూకోజ్ ఆక్సిడేస్ వంటి సహజ ఎంజైమ్లను నాశనం చేస్తాయి. దీనితో పాటు తేనెను వేడి చేయడం వల్ల అనేక విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు కూడా నాశనమవుతాయని చెబుతున్నారు. తేనెను వేడి చేయడం లేదా ఎక్కువ సేపు నిల్వ చేయడం వల్ల శరీరానికి హానికరమైన హైడ్రాక్సీమీథైల్ఫర్ప్యూరల్ (HMF) ఉత్పత్తి అవుతుందని హెచ్చరిస్తున్నారు. తేనెను వేడి చేస్తే అందులో యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి, ఇది సెల్యులార్ డ్యామేజ్ నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తేనెను దానిని సహజ, ముడి రూపంలో తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

తేనెను తినడానికి సురక్షితమైన మార్గం..
ఆయుర్వేదం, వైద్యుల అభిప్రాయంలో తేనెను దాని సహజ రూపంలోనే తినమని సిఫార్సు చేస్తున్నారు. అయితే మీరు దానిని పానీయంలో చేర్చాలనుకుంటే, టీ లేదా నీరు చాలా వేడిగా లేదా మరిగేలా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. తాగగలిగే ఉష్ణోగ్రతకు నీటిని చల్లార్చిన తరువాత దానికి తేనెను జోడించాలని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయంలో సులభమైన, సురక్షితమైన మార్గం ఏమిటంటే.. ఒక చెంచా తేనెను నేరుగా తిని, దానిపై గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం ఉత్తమం అంటున్నారు. వేడినీటిలో లేదా వేడి టీలో ఎప్పుడూ తేనెను జోడించవద్దని హెచ్చరిస్తున్నారు. తేనెను గోరువెచ్చని నీటిలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.

READ ALSO: Cuttack Violence: దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో హింసాత్మక ఘర్షణ.. కటక్‌లో తాత్కాలికంగా ఇంటర్నెట్ బంద్

Exit mobile version