Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bubble Gum: మనం సరదాగా నమిలి, బుడగలు ఊదే ‘బబుల్ గమ్’ వెనుక ఒక ఆసక్తికరమైన, ఆకస్మికమైన (యాదృచ్ఛిక) చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ బబుల్ గమ్ ఒక సైంటిస్ట్ వల్ల కాకుండా, ఒక కంపెనీలో లెక్కలు చూసుకునే అకౌంటెంట్ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యింది. మానవులకు వేల సంవత్సరాల క్రితం నుంచే చెట్ల జిగురును నమిలే అలవాటు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. మాయన్లు సపోడిల్లా చెట్టు జిగురును, గ్రీకులు మాస్టిక్ చెట్టు జిగురును నమిలేవారు. ఆధునిక కాలంలో 1840లలో జాన్ బి.కర్టిస్ మొదటిసారిగా వాణిజ్యపరమైన చూయింగ్ గమ్‌ను తయారు చేయగా, 1800ల చివరలో థామస్ ఆడమ్స్ సపోడిల్లా జిగురుతో మరింత మృదువైన చూయింగ్ గమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ కేవలం నమలడానికి మాత్రమే పనికొచ్చేవి, కానీ వీటితో బుడగలు ఊడటం సాధ్యపడేది కాదు.
అకౌంటెంట్ చేతిలో అద్భుతం
1920లలో ఫిలడెల్ఫియాకు చెందిన ‘ఫ్లీర్ కార్పొరేషన్’ బుడగలు ఊదడానికి వీలయ్యే బబుల్ గమ్‌ను తయారు చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేసి ఫేయిల్ అయ్యింది. ఆ సమయంలో అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసే ‘వాల్టర్ డీమర్’ ఖాళీ సమయాల్లో ల్యాబ్‌లో రకరకాల ఫార్ములాలతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత, 1928లో ఆయన ఒక ప్రత్యేకమైన ఫార్ములాను కనుగొన్నారు. ఈ కొత్త గమ్ సాగే గుణాన్ని కలిగి ఉండి, అతుక్కోకుండా, పెద్ద బుడగలు ఊదడానికి వీలుగా మారింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి సక్సె్స్‌ఫుల్‌గా బబుల్ గమ్ పుట్టుకొచ్చింది. నిజానికి బబుల్ గమ్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది గులాబీ రంగే. అయితే ఈ రంగును ప్రత్యేకంగా ఎంచుకోలేదు. వాల్టర్ డీమర్ మొదటిసారి ఆ గమ్‌ను తయారు చేసినప్పుడు, ఆ ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న ఏకైక ఫుడ్ కలర్ గులాబీ రంగు మాత్రమేనట. దాంతో ఆయన దాన్నే ఉపయోగించాల్సి వచ్చింది. ఆ రంగు కాస్తా కాలక్రమేణా బబుల్ గమ్‌కు ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
ఫ్లీర్ కంపెనీ ఈ గమ్‌ను ‘డబుల్ బబుల్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు రేషన్‌గా చూయింగ్ గమ్ ఇవ్వడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. 1947లో వచ్చిన ‘బజూకా’ గమ్ కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. బబుల్ గమ్‌తో బుడగలు ఊదడం అనేది ఒక కళగా మారి పోటీలకు కూడా దారితీసింది. 2004లో ‘చాడ్ ఫెల్’ అనే వ్యక్తి చేతులు ఉపయోగించకుండా ఏకంగా 50.8 సెంటీమీటర్ల (20 ఇంచుల) వ్యాసం కలిగిన అతిపెద్ద బుడగను ఊది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలా ఒక చిన్న ల్యాబ్‌లో అనుకోకుండా జరిగిన ఆవిష్కరణ, నేడు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి వినోదాన్ని, ఉపాధిని క్రియేట్ చేసింది.
తాజావార్తలు
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..