Site icon NTV Telugu

Bedroom : మీ బెడ్‌రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు !

Bedroom

Bedroom

మనలో చాలామంది ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఆహారం, వ్యాయామం, మందులు, చెక్‌అప్స్ అన్నీ రెగ్యులర్‌గా చేస్తాం. కానీ మనం ఎక్కువ సమయం గడిపే బెడ్‌రూంలోనే మన ఆరోగ్యానికి గుప్త శత్రువులు దాక్కుని ఉంటార‌ని ఊహించగలరా? ప్రతిరోజూ రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోవాలని బెడ్‌రూం లోకి అడుగుపెడతాం. కానీ అదే గది మన శరీరానికి సైలెంట్ పొయిజన్ లాగా మారిపోతే? గుండె జబ్బులు, నిద్ర సమస్యలు, అలర్జీలు, హార్మోన్ అసమతుల్యత వంటి అనారోగ్యాలు నెమ్మదిగా పెరుగుతుం‌టే? ఇదే విషయాన్ని ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన డాక్టర్స్ స్పష్టంగా హెచ్చరించారు. నిద్ర, జీర్ణవ్యవస్థ, లాంగ్‌టర్మ్ హెల్త్‌కి నేరుగా హాని కలిగించే 3 వస్తువులను బెడ్ రూమ్‌లోంచి వెంటనే తోలగించాలి అని హేచ్చరిస్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి? ఎందుకు వెంటనే పారేయాలో ఒక్కోటి చూద్దాం..

1. పాత దిండ్లు – రోగాల గూడు!
దిండు అంటే మనకు కేవలం నిద్రలో సౌకర్యం కలిగించే వస్తువే అనుకుంటాం. కానీ డాక్టర్ల మాటల్లో అయితే ఇది “సైలెంట్ హెల్త్ రిస్క్”. రెండు సంవత్సరాలకు మించి వాడిన దిండ్లు కేవలం బట్టల గుట్టలా కాకుండా – దుమ్ము, చెమట, చర్మ కణాలు, అలర్జీ కారకాల బ్రీడింగ్ గ్రౌండ్‌గా మారిపోతాయి. పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే – పాత దిండ్లలో లక్షల సంఖ్యలో డస్ట్ మైట్స్ ఉంటాయి. వీటివల్ల శ్వాసకోశ సమస్యలు,ఆస్తమా ట్రిగర్స్, చర్మ ర్యాషెస్, ఎగ్జిమా,అలర్జీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కనుక ఒక దిండు వాడుకలో రెండేళ్లు దాటితే, అది మెల్లగా ‘డిసీజ్ ఫ్యాక్టరీ’గా మారుతుంది. కాబట్టి పాత దిండ్లను వదిలి, కొత్త దిండ్లు వాడటం తప్పనిసరి” అని వైద్యూలు హెచ్చరిస్తున్నారు. అంటే, నిద్రలో మనకు ఆత్మశాంతి ఇవ్వాల్సిన దిండు – తెలియకుండానే మన ఆరోగ్యానికి శత్రువుగా మారిపోతోంది.

2 . సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్‌లు – విష వాయువుల బాంబ్
మనమంతా ఇంట్లో సువాసన కోసం రూమ్ స్ప్రేలు, ఎయిర్ ఫ్రెషనర్‌లు వాడుతుంటాం. కానీ ఇవి నిజానికి “పాయిజన్ గ్యాస్ బాటిల్స్” లాంటివి. బయటకు ఫ్రెష్ స్మెల్ ఇస్తున్న లోపల మన శరీరానికి నెమ్మదిగా హాని చేస్తున్నాయి. వీటిలో ఉండే థాలేట్స్ (Phthalates), VOCలు (Volatile Organic Compounds) హార్మోన్ల అసమతుల్యతకు,శ్వాసకోశ సమస్యలకు,ఆస్తమా తీవ్రత పెరగడానికి, ప్రోడ్‌క్టివ్ హెల్త్ డిసార్డర్స్‌కు ప్రధాన కారణమవుతాయి. ఒక స్టడీ ప్రకారం మార్కెట్లో లభించే ఎయిర్ ఫ్రెషనర్‌లలో 86% ఉత్పత్తుల్లో థాలేట్స్ ఉన్నట్లు గుర్తించారు. అంటే మనం ఇంటి వాసన కోసం వాడే వి నెమ్మదిగా ప్రాణ వాయువును విష వాయువుగా మార్చేస్తున్నాయి. కనుక సింథటిక్ ఫ్రెషనర్‌లకు బదులుగా ఎసెన్షియల్ ఆయిల్స్, నేచురల్ ఫ్రెషనర్స్ వాడండి. సురక్షితం, మనసుకు ప్రశాంతత కూడా ఇస్తాయి” అని సూచించారు.

3 . పాత పరుపులు – నిద్రలేని రాత్రుల కారణం
రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకునే మంచం మన శరీరానికి ఎనర్జీ ఇస్తూ, మళ్లీ కొత్త ఉదయం ప్రారంభించడానికి సిద్ధం చేయాలి. కానీ అదే పరుపు 7–10 ఏళ్లు దాటిపోతే, మన ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. ఎందుకంటే పాత పరుపుల్లో వెన్నెముకకు సరైన సపోర్ట్ ఉండదు. బరువు పడిన చోట గుంతలు ఏర్పడతాయి.. దుమ్ము, అలర్జీ కారణాలు పేరుకుపోతాయి
ఫలితంగా.. నడుము నొప్పి, శరీర నొప్పులు, తీవ్ర నిద్రలేమి.. నిద్ర క్వాలిటీ తగ్గిపోవడంతో, ఉదయం లేవగానే అలసట, చిరాకు, పనిలో ఫోకస్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇది క్రమంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే నిపుణులు చెబుతున్నారు: 10 ఏళ్లు దాటిన పరుపును వెంటనే రీప్లేస్ చేయండి. మంచి పరుపు అంటే కేవలం లగ్జరీ కాదు అది ఆరోగ్యానికి ఇన్వెస్ట్‌మెంట్.

ఇప్పుడే మీ బెడ్‌రూం చెక్ చేయండి.. ఈ 3 వస్తువులు కనబడితే, ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు పారేయండి.

Exit mobile version