No-Cook Breakfast Recipes: గ్యాస్ అవసరమే లేదు, ఈ వంటకాలను ఈజీగా చేసుకోండి..

  • వంట గ్యాస్ లేదనే బాధ వద్దు..
  • గ్యాస్ అవసరం లేకుండా ఈ వంటకాలు చేసుకోండి..
Food

Food

No-Cook Breakfast Recipes: ఇరాన్ యుద్ధం వంటింటిలో మంటలు పెడుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలను LPG గ్యాస్ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు చెబుతోంది. సంక్షోభాన్ని నివారించేందుకు కమర్షియల్ గ్యాస్‌ను తగ్గించి, సాధారణ ప్రజలకు గ్యాస్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంది.

అయితే, గ్యాస్ అవసరం లేకుండా కొన్ని ఆహారాలను సిద్ధం చేసుకోవచ్చు. మంట వెలిగించకుండానే ఈ ఈజీ రెసిపీలను తయారు చేసుకుని తినొచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తుంది. ఇప్పుడు ఆ వంటకాలు ఏంటో చూద్దాం.

దహి-చురా:
దహి-చురా అనేది బీహార్, తూర్పు భారతదేశం నుండి వచ్చిన ఒక ప్రసిద్ధ భారతీయ అల్పాహార వంటకం. ఇందులో పెరుగు, చక్కెర లేదా బెల్లం కలిపిన అటుకులు ఉంటాయి. ఇది కడుపుకు తేలికగా ఉంటుంది, గ్యాస్ మండించకుండా నిమిషాల్లో తయారు చేయవచ్చు.

సత్తు పిండి పానీయం:

వేయించిన శనగలతో చేసే సత్తు పిండి పానీయానికి గ్యాస్ అవసరం లేదు. ఈ రెసిపీ ప్రొటీన్ కు నిలయం. ఒక గ్లాస్ నీటిలో 2-3 చెంచాట సత్తుపిండి, నల్ల ఉప్పు, వెయించిన జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపితే ఈ పానీయం రెడీ అవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి, చల్లదనాన్ని ఇస్తుంది.

మొలకలు:

మొలకెత్తిన పెసర్లు, శనిగలు, పల్లీలతో ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. వీటిలో ఉల్లిపయాలు, టమాటోలు, కీర, నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పుకలిపితే పోషకాలు అధికంగా ఉండే సలాడ్ రెడీ అవుతుంది. దీనిని వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు.

ఫ్రూట్-పెరుగు బౌల్:

పెరుగులో అరటిపండు, ఆపిల్, బొప్పాయి ముక్కలను కలిపి తీసుకోవచ్చు. అదనపు రుచి కోసం దీనిపై తేనే లేదా డ్రైఫ్రూట్ చల్లుకుంటే అద్భుతమైన హెల్తీ బ్రేక్‌ఫాస్ రెడీ అవుతుంది.

పనీర్ సాండ్‌విచ్:

బ్రెడ్ ముక్కల మధ్య తురిమిన పనీర్, చాట్ మసాలా, పచ్చి చట్నీ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రెడ్‌ను టోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.

వేయించిన నల్ల శనిగలు:

మార్కెట్‌లో దొరికే నల్ల శనిగలకు ఉప్పు, నిమ్మరసం కలిపి స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి.

బొరుగుల మిశ్రమం:

మురమురాలు(బొరుగులు)తో మంచి స్నాక్ చేసుకోవచ్చు. పల్లిలు, ఉల్లిపాయాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆవనూనె లేదా ఏదైనా నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది చేయడానికి గ్యాస్ అవసరమే లేదు.

పీనట్ బటర్ అండ్ బ్రెడ్:

మల్టీగ్రెయిన్ బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసి, దానిపై రెండు అరటి ముక్కలు వేసుకుంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం.