NTV Telugu Site icon

Onion: చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే ఫీవర్‌ ఎందుకు వస్తుంది?

Onoons

Onoons

Onion: చాలా సినిమాల్లో, కథల్లో చంకలో ఉల్లిపాయ పెట్టడం వల్ల జ్వరం వస్తుందని గమనించే ఉంటారు. ఎందుకిలా జరుగుతోందన్న సందేహం చాలా మందికి ఇప్పటికీ ఉంది. ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు చాలా మంది ఉన్నారు. ఇందులో నిజం ఏంటి..? నిజంగానే ఉల్లిపాయ చంకలో పెట్టుకు జర్వం వస్తుందా? అనే అనుమానం ఇప్పటికీ చాలామంది ఉంది. ఉల్లిపాయను నిలువుగా కోసి రెండు చంకల్లో గంటసేపు ఉంచడం వల్ల.. చంకలోని మృదువైన చర్మం ఉల్లిపాయ రసాన్ని త్వరగా పీల్చుకుంటుంది. దాని వల్ల శరీరం ఒక్కసారిగా వేడెక్కుతుంది. శరీరం సగటు శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు లోనవుతుంది. దీనినే మనం జ్వరం అంటాము.

Read also: Ghee: నెయ్యి ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది

దీనికి అసలు కారణం ఉల్లిలో ఉండే సఫాక్సైడ్, ఐసోలిన్, ఎలిసిన్ వంటి సహజ రసాయనాలు శరీరాన్ని వేడెక్కించి చికాకు కలిగిస్తాయి. దీంతో శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది. అంతేకాక, ఉల్లిపాయ శరీరం నుండి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మరియు వైరస్లను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కారణంగా, శరీరాన్ని రక్షించే సూక్ష్మజీవులు లేకపోవడం వల్ల జ్వరం వస్తుంది. ఈ జ్వరం మన శరీరాన్ని ఎంత వేడిగా చేస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల నిజంగానే అనారోగ్యానికి గురికాము. ఇది హార్మోన్లను నిర్వహించడం మరియు జ్వరాన్ని ప్రేరేపించడం వంటిది మాత్రమే. కానీ బీపీ, షుగర్ వంటి తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఉన్నవారికి ఈ ట్రిక్ చాలా ప్రమాదకరం. శరీర ఉష్ణోగ్రతలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ప్రాణాపాయం కావచ్చు. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
Stephen raveendra: గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి