శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. ఇది చాలా పనులు చేస్తుంది. కాలేయం యొక్క విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం, రక్తం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడం, పైత్యరస అనే ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం. కాలేయం చెడిపోతే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. లివర్ దెబ్బతింటే… ఆకలి లేకపోవడం, అలసట, కామెర్లు, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మందికి లివర్ సమస్యలు పెరుగుతున్నాయి.
READ MORE: AP Special Status: ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు…
సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యపానం, ధూమపానం కారణమవుతాయని అనుకుంటాం. ఇవే కాకుండా లివర్ దెబ్బతినడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవే మనం తినే ఆహారం, తాగే నీరు. నమ్మకపోయినా ఇది వాస్తవం. మనం తినే ఆహార పదార్థాలు, తాగే నీరు కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పలు రిపోర్టుల్లో వెల్లడైంది. ప్రస్తుత జీవన విధానంలో ఏది పడితే అది తింటూ పొట్టను చెత్త కుప్పలా మార్చుకుంటున్నాం. కలుషితమైన నీటిని తాగుతున్నాం. ఇలా మనకు తెలియకుండానే మన కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
READ MORE: Zomato: జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఇదే..
హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, పటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్లు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జన్యుపరమైన సమస్యలతో వారసత్వంగా వచ్చే ల్సన్ వ్యాధి, హిమోక్రోమాటోసిస్ వంటి వాటి వల్ల కూడా కాలేయ వ్యాధులు వస్తాయి. అంతేకాదు కొన్నిసందర్భాల్లో కాలేయంలో అసాధారణ కణాలు పెరిగి కణితులుగా మారి లివర్ క్యాన్సర్ రావచ్చు. అందుకే ఆహారం, నీళ్ల విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మద్యం తాగడం మానేయండి.. కాలేయాన్ని రక్షించుకోండి..