Site icon NTV Telugu

Blood Donation: వామ్మో.. రక్తదానం చేస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఇంకెందుకు ఆలస్యం…!

Whatsapp Image 2024 03 12 At 7.16.38 Pm

Whatsapp Image 2024 03 12 At 7.16.38 Pm

రక్తదానం.. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రక్తదానం అనేది ప్రతీ ఒక్కరూ వారి జీవితంలో చేయాల్సిన ఓ సామాజిక బాధ్యత. ఏవరికైనా రక్తం అవసరమైనప్పుడు సరైన సమయంలో అందకపోవడంతో చాలా మంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విషయం పై ఎప్పటికప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేకమార్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇక మన దేశంలో ప్రతి సంవత్సరం కేవలం 10 శాతం మంది మాత్రమే రక్తందానం చేయాడాయికి ముందుకి వస్తున్నారు. రక్తదానం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని, శరీరం బలహీనంగా మారుతుందని చాలామందికి ఓ అపోహ ఉంది. అయితే అది పూతిగా తప్పుడు అపోహ మాత్రమే.

కాకపోతే నిజానికి రక్తదానం చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇక రక్తదానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అదుపులో ఉండడంతోపాటు.. రక్తంలో ఎక్కువగా ఉండే ఐరన్.. రక్త ధమనులను అడ్డుకుంటుంది. ఈ దెబ్బతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండడంతో… హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి కారణం తీస్తుంది. రక్తదానం చేయడం ద్వారా రక్తంలోని ఐరన్ నిల్వలు తగ్గడంతో ధమనులు చక్కగా పని చేస్తాయి. ఇలా గుండెకి ప్రమాదం కూడా తగ్గుతుంది.

నిజానికి రక్తంలో ఐరన్ అనేది కొందరిలో కాస్త అధికంగా ఉంటుంది. దింతో వారికి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి తరచూ రక్త దానం చేయడం వల్ల శరీరంలోని రక్తంలో ఐరన్ స్థాయిలు అనేవి తగ్గడంతో క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావం కూడా తగ్గుతుంది. అంతేకాదు రక్తదానం చేయడం ద్వారా బరువు తగ్గేందుకు కూడా అవకాశం లేకపోలేదు. మన శరీరంలో వివిధ రకాల వ్యాధులను నివారించుటకు రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి, కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉండాలన్న మన శరీరంలో కావలిసినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు రక్త దానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి వ్యవస్థను పెంపొందించుకోవచ్చు.

Exit mobile version