Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tati Garelu: కాలం మారినా, రకరకాల నయా వంటకాలు వచ్చినా.. పాతకాలపు నోరూరించే సంప్రదాయ పిండివంటల రుచే వేరు. ముఖ్యంగా వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో తాటిపండ్ల సువాసనతో పరిమళించే ‘తాటి గారెలు’ తింటే ఆ మజానే వేరు. బయట కరకరలాడుతూ, లోపల తియ్యటి మెత్తదనంతో ఉండే ఈ తాటి గారెలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇంతటి రుచికరమైన తాటి గారెలను పర్ఫెక్ట్ కొలతలతో, ఏమాత్రం చేదు రాకుండా ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
తాటి గుజ్జు: 1 కప్పు
Also Read
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
వరి పిండి: 1 కప్పు
బాంబాయి రవ్వ (ఉప్మా రవ్వ): 1/2 కప్పు
బెల్లం తురుము: 1/2 కప్పు (రుచికి సరిపడా)
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో తాటి గుజ్జు, వరి పిండి, బొంబాయి రవ్వ, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బెల్లం బాగా కరిగేలా మిశ్రమాన్ని బాగా కలిపి, సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గారెల్లా ఒత్తి, కాగుతున్న నూనెలో వేయాలి. తర్వాత గారెలు లోపల వరకు మంచిగా వేగడానికి స్టవ్‌ను మీడియం మంటపై ఉంచి 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించాలి. గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కల్లర్లోకి మారిన తర్వాత నూనె నుంచి బయటకు తీయాలి. ఈ కొలతలతో చేస్తే తాటి గారెలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి. అంతే ఎంతో టెస్టీగా ఉండే తాటి గారెలు రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు:
* తాటి గుజ్జులో సహజ సిద్ధమైన గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
* తాటిపండులో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
* తాటిపండు సహజంగానే చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గించి, డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
* ఇందులో విటమిన్ B, విటమిన్ C తో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడతాయి.
* ఈ రెసిపీలో చక్కెరకి బదులుగా బెల్లం ఉపయోగిస్తాం కాబట్టి, శరీరంలో ఐరన్ శాతం పెరిగి ఐరన్ లోపం (Anemia) తగ్గుతుంది.
* తాటి గుజ్జులో ఉండే సహజ ఆంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తాటి గారెలను డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి, డయాబెటిస్ లేదా అధిక బరువు ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!