Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Hair Care Tips: వేసవి కాలంలో మండే ఎండలు, చెమట, తేమ కారణంగా తల చర్మం త్వరగా జిడ్డుగా మారుతుంది. దీంతో చాలామంది, ముఖ్యంగా యువత, ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం ప్రారంభిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన విధంగా జుట్టు కడగకపోతే జుట్టు రాలడం, పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నట్లుగా, వేసవిలో జుట్టు కడగాల్సిన సంఖ్య ప్రతి ఒక్కరి జుట్టు రకం, జీవనశైలి, చెమట పట్టే స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఒకరికి సరిపోయే పద్ధతి మరొకరికి సరిపోవచ్చు అనే గ్యారంటీ లేదు.
ప్రతిరోజూ షాంపూ చేయడం మంచిదేనా?
చాలామంది తలపై చెమట పడిందంటే వెంటనే షాంపూ చేయాలని భావిస్తారు. కానీ పదే పదే షాంపూ చేయడం వల్ల తల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోతాయి. దీంతో జుట్టు పొడిగా మారి, నిర్జీవంగా కనిపించి, చివరకు విరిగిపోవడం లేదా రాలిపోవడం ప్రారంభమవుతుంది. నిపుణుల ప్రకారం, కేవలం నీటితో తల కడుక్కోవడం మరియు షాంపూతో తలస్నానం చేయడం రెండూ వేర్వేరు విషయాలు. చెమట లేదా దుమ్ము తొలగించడానికి సాధారణ నీటితో జుట్టు కడగవచ్చు. కానీ షాంపూను తరచుగా వాడటం మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
Also Read
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేయాలి
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, తలస్నానం చేయడానికి ఒకే రకమైన నియమం అందరికీ వర్తించదు. జిడ్డుగా ఉండే తల చర్మం ఉన్నవారు.. జుట్టు చాలా పలుచగా ఉండే వారు లేదా తల చర్మం ఎక్కువగా జిడ్డుగా మారే వారు వేసవిలో ఒక రోజు విడిచి ఒక రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు. అవసరమైతే ప్రతిరోజూ కూడా తేలికపాటి షాంపూను ఉపయోగించవచ్చు. ఎందుకంటే చెమట, నూనె ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది.
ఉంగరాల లేదా ఒత్తైన జుట్టు ఉన్నవారు
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, ఉంగరాల లేదా ఒత్తైన జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ షాంపూ చేయడం మానుకోవాలి. ఈ రకమైన జుట్టులో సహజ నూనెలు జుట్టు చివర్ల వరకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వారానికి ఒకటి లేదా రెండు సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది.
వ్యాయామం తర్వాత ఏమి చేయాలి?
జిమ్‌లో వర్కౌట్ చేయడం, పరుగులు తీయడం లేదా ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. హెల్త్ నిపుణుల ప్రకారం, చెమట ఎక్కువసేపు తలపై ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. అయితే ప్రతిసారి చెమట పట్టిందని షాంపూ చేయడం సరైన పద్ధతి కాదు. వ్యాయామం తర్వాత శుభ్రమైన నీటితో తలను బాగా కడుక్కోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల చెమట తొలగిపోతుంది, కానీ జుట్టు సహజ తేమ కోల్పోదు.
షాంపూ, కండీషనర్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
నిపుణుల సూచనల ప్రకారం, షాంపూను ఎల్లప్పుడూ తల చర్మానికి మాత్రమే రాయాలి. కండీషనర్‌ను మాత్రం జుట్టు పొడవు భాగానికే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. వేసవిలో జుట్టు సంరక్షణకు సరైన తలస్నానం పద్ధతి చాలా ముఖ్యం. జుట్టు రకాన్ని అర్థం చేసుకుని, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
-
Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
-
Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
-
Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
-
Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!