Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్‌గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Aratikaya Bajji: సాధారణంగా మనం శెనగపిండితో చేసే బజ్జీలను తింటూ ఉంటాము. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో కూడా ఎంతో రుచికరమైన బజ్జీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఈ స్టోరీలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి బజ్జీని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
రాగి పిండి: 1 కప్పు (240 ml)
మైదా పిండి: 1/4 కప్పు
మిరప పొడి: 1 టీస్పూన్
వెల్లుల్లి: 3 రెబ్బలు (దంచినవి)
ఉప్పు: రుచికి సరిపడా
వంట సోడా (Baking Soda): 1/2 టీస్పూన్
నీళ్లు: తగినంత
అరటికాయ: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఒక గిన్నెలో రాగి పిండి, మైదా పిండి, మిరప పొడి, దంచిన వెల్లుల్లి, ఉప్పు – వంట సోడా వేసి బాగా కలపాలి. రాగి పిండి కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి, బజ్జీలు మెత్తగా రావడం కోసం వంట సోడా తప్పనిసరిగా వాడాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక పచ్చి అరటికాయను తీసుకుని దానిపై ఉన్న తొక్కను తీసేయాలి. ఆపై మీకు నచ్చిన పరిమాణంలో ముక్కలుగా కోసుకోవాలి. స్లైసర్‌తో కోస్తే ముక్కలు చాలా పల్చగా వస్తాయి, కాబట్టి కత్తితో కొంచెం మందంగా కోసుకుంటే బజ్జీలు రుచిగా ఉంటాయి.
స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత, కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను రాగి పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బజ్జీలు రెండు వైపులా బాగా కాలేలా తిప్పుకోవాలి. వంట సోడా వేసినందున బజ్జీలు బాగా ఉబ్బుతాయి. మంచి రంగు వచ్చిన తర్వాత నూనె నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. రాగి పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇది పిల్లలకు, పెద్దలకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్‌గా పని చేస్తుంది. శెనగపిండితో బోర్ కొట్టినప్పుడు ఈ ఆరోగ్యకరమైన రాగి బజ్జీలను ప్రయత్నించి చూడండి.
ప్రయోజనాలు ఇవే..
ధాన్యాలన్నింటిలోనూ రాగిలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. రాగిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, దీంతో అతిగా తినడం తగ్గి బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. రాగిలో ఉండే ‘పాలీఫెనాల్స్’ – ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్ లేదా మైదాతో పోలిస్తే రాగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఐరన్ లోపంతో బాధపడేవారికి రాగి గొప్ప వరం. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. రాగి ప్రకృతి సిద్ధంగానే శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే వేసవిలో రాగి జావ లేదా ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం వేడి తగ్గుతుంది.
తాజావార్తలు
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్‌గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..