Site icon NTV Telugu

Pumpkin Seeds : ఆ గింజలను రోజుకు పది తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..

Pumpkin Seeds

Pumpkin Seeds

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. గుమ్మడి గింజలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ గింజలను ఎలా తీసుకోవాలి.. రోజుకు ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు.. కొందరు నానబెట్టుకొని తింటే మరికొందరు మాత్రం సలాడ్స్ రూపంలో తింటారు.. ఎలా తిన్నా సరే గుమ్మడికాయ విత్తనాలను తింటే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. గుమ్మడికాయ విత్తనాలను రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.. అధిక కొవ్వు తగ్గిపోతుంది..

ఈ గింజలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. జుట్టు పెరుగుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అయితే గుమ్మడికాయ విత్తనాలను రోజుకు ఎన్ని తినాలి అనే సందేహం అందరికీ వస్తుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే రోజుకు పది గింజలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అంతకు మించితే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version