Cancer Vaccine: క్యాన్సర్ వ్యాధి ఇప్పటికీ వైద్యశాస్త్రానికి అంతు చిక్కనిదిగా ఉంది. క్యాన్సర్ వచ్చిన రోగులు తొలి దశల్లో గుర్తిస్తే తప్పా.. అడ్వాన్సుడ్ స్టేజెస్‌లో దానిని పూర్తిగా నివారించలేదని పరిస్థితి ఉంది. అయితే, ప్రస్తుతం క్యాన్సర్ వ్యాక్సిన్‌పై కొనసాగుతున్న పరిశోధనలు భవిష్యత్తుపై ఆశల్ని పెంచుతున్నాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా అద్భుతమైన వ్యాక్సిన్ దాని మొదటి క్లినికల్ ట్రయల్స్ నుంచి ప్రోత్సాహకరమైన ప్రారంభ ఫలితాలను ఇచ్చింది. మెడెర్నా ఫార్మాసూటికల్ అభివృద్ధి చేస్తున్న ఈ mRNA-4359 వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడానికి, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది.
మెడెర్నా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌లో కూడా ఇదే mRNA సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను, క్యాన్సర్ కణితి కణాలను రోగనిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది. అడ్వాన్సుడ్ క్యాన్సర్ ట్యూమర్ కలిగిన 19 మంది రోగుల్లో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. 8 మంది రోగుల్లో కణితుల పెరుగుదల లేదని, కొత్త కణితులు కనిపించలేదని తేలింది. దీంతో పాటు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు లేకుండా, బాగా తట్టుకోగలిగినట్లు కనుగొనబడింది.
Read Also: Team India: 28 ఏళ్లు నిండకుండానే టెస్టు కెరీర్‌కి గుడ్ బై చెప్పిన భారత ఆటగాళ్లు..!
కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఎక్స్‌పరిమెంటల్ క్లినికల్ రీడర్ అండ్ గైస్ అండ్ సెయింట్ థామస్ NHS ఫౌండేషన్ ట్రస్ట్‌లో మెడికల్ ఆంకాలజీలో కన్సల్టెంట్ అయిన చీఫ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ దేబాషిస్ సర్కర్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ అధ్యయనం mRNA క్యాన్సర్ ఇమ్యునోథెరపీని మూల్యంకనం చేయడంలో ముఖ్యమైన మొదటి అడుగు అని అన్నారు. క్యాన్సర్‌లతో బాధపడుతున్న రోగులకు కొత్త చికిత్సను అభివృద్ధి చేయడం వల్ల తీవ్రమైన దుష్ర్పభావాలు లేకుండా బాగా తట్టుకోగలదని, క్యాన్సర్‌కు మరింత ప్రభావవంతంగా చికిత్స చేయడంలో సహాయపడే విధంగా శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించగలదని మేము చూపించాము.
అయితే, ఈ అధ్యయనం ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలో రోగులుపై మాత్రమే జరిగింది. ఆధునాతన దశ క్యాన్సర్ ఉన్నవారికి ఇది ఎంత ప్రభావంతంగా ఉంటుందో చెప్పడం చాలా తొందరగా అవుతుందని అన్నారు. ప్రస్తుతం మెలనోమా, నాన్ స్మాల్ సెల్ లంగ్స్ క్యాన్సర్ వంటి నిర్ధిష్టం క్యాన్సర్లతో బాధపడుతున్న వారిపై అధ్యయనం జరిగింది.