Site icon NTV Telugu

Natural Drinks to Cleanse Liver: మీ లివర్ ఆరోగ్యానికి ఐదు పానీయాలు.. తప్పక ట్రై చేయండి..

Healthy Liver Tips

Healthy Liver Tips

Natural Drinks to Cleanse Your Liver: కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉండటం కోసం మన ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని హెల్తీ హ్యాబిట్స్ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. అందులో భాగంగానే మీ లివర్‌ని సహజంగా శుభ్రపరచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

నిమ్మ నీరు: గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి త్రాగడం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన మార్గం. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి, పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు త్రాగడం కాలేయ శుభ్రపడటంతో పాటు మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయ కణాలను రక్షిస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే.. కాలేయ ఎంజైమ్‌లు బాగా పనిచేస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం తగ్గుతుంది.

బీట్‌రూట్ రసం: తాజా బీట్‌రూట్ రసం వారానికి రెండు-మూడు సార్లు తాగడం వల్ల కాలేయం బలపడుతుంది. పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాలేయం, పేగులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నందున, బీట్‌రూట్ రసం రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

పసుపు టీ: పసుపుతో తయారుచేసిన టీ కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం వాపును తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పసుపు కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, చెడు కణాలను మరమ్మతు చేయడానికి, హానికరమైన పదార్థాల నుంచి కాలేయాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

అల్లం-పుదీనా నీరు: అల్లం, పుదీనాను మరిగించి తయారుచేసిన ఈ పానీయం రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అల్లం కాలేయ వాపును తగ్గిస్తుంది. పుదీనా జీర్ణక్రియ, పిత్త ఉత్పత్తికి సహాయపడుతుంది. రెండూ కలిసి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

 

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version