Site icon NTV Telugu

Tips for beautiful Eyes: కళ్ళ కోసం ఆ క్రీం వాడుతున్నారా? అయితే..

Tips For Beautiful Eyes

Tips For Beautiful Eyes

natural beauty tips for healthy beautiful eyes: మన తెలుగు కవులు కళ్ళను ప్రకృతి సౌందర్యాలతో పోలుస్తుంటారు. అయితే వారు అలా పోల్చటానికి కారణం ఎంతో ఉంది. కళ్ళు అందంగా ఉంటే ఆ ఆకర్షణే వేరు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుందట. ఇదీ మన కవులే చెబుతున్నారు. ప్రతి వారి ముఖం ఆకర్షణీయంగా కనపడాలంటే వారి కళ్ళు బాగుండాలి. వారి కళ్ళను బట్టే వారి అందం ఇనుమడిస్తుంది. అందానికి మాత్రమే కాదు మన ఆరోగ్యాన్నికి కూడా నిదర్శనం మన కళ్ళే అందుకే కళ్ళను చక్కగా కాపాడుకుంటే అందం ఇనుమడిస్తుంది. అలా చాలా మంది కళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఏమేమి వాడాలో ఎలా వాడాలో తెలియక సతమతమవు తుంటారు. వారి కోసమే ఈ చిట్కాలు.. ఈ కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

అదీకాక మన కళ్ళకు పడే క్రీములు కాకపోతే కళ్ళు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతోనే వాడాలి. అర టీస్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి.కళ్ళకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి. గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళను కడుక్కుంటే కళ్ళు మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా వి కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు. కొందరికి నిద్రలేమి, అలసట.. ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
Read also: TS Group 1 Exam : 45 రోజుల పసిపాపతో గ్రూప్‌ 1 పరీక్షకు ఓ మహిళ.. తల్లి పరీక్ష రాస్తుంటే.. పాప ఆకలితో ఏడుస్తూ..

Exit mobile version