Site icon NTV Telugu

Mosquitoes Study: బీర్ తాగేవారంటే దోమలకు ఎంతో ఇష్టమట.. పరిశోధనలో సంచలన విషయాలు..

Beer

Beer

Mosquitoes Prefer People Who Drink Alcohol: నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. ఈ పరిశోధనను 500 మందిపైగా జనాలతో నిర్వహించారు. ఈ 500 మంది చేతులను దోమలతో నిండిన పెట్టెలో ఉంచి కెమెరాలో రికార్డ్ చేశారు. మద్యం సేవించిన వారిని 34 శాతం ఎక్కువగా దోమలు కుట్టినట్లు ఈ పరిశోధనలో తేలింది. అదే సమయంలో స్నానం చేయని, లేదా సన్‌స్క్రీన్ అప్లై చేయని, గత రాత్రి సె**క్స్ లో పాల్గొన్న వారిని ఎక్కువగా కుడతాయని తేలింది.

READ MORE: Unclaimed Deposits: రూ. 1.84 లక్షల కోట్ల క్లెయిమ్ చేయని డబ్బును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

నెదర్లాండ్స్‌లోని అత్యంత ప్రసిద్ధ సంగీత ఉత్సవం లోలాండ్స్‌కు నిజ్‌మెగెన్‌లోని రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయం నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు చేరుకున్నారు. లోలాండ్స్ సంగీతం అనేది నెదర్లాండ్స్‌లోని ఒక ప్రసిద్ధ మూడు రోజుల సంగీత, క్యాంపింగ్ ఉత్సవం. దీనిని “ఎ క్యాంపింగ్ ఫ్లైట్ టు లోలాండ్స్ ప్యారడైజ్” అని కూడా అంటారు. ఈ ఉత్సవం ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు తూర్పున బిడ్డింగ్‌హుజెన్‌లో జరుగుతుంది. అయితే ఈ మూడు రోజుల ఉత్సవంలో పాల్గొని సంగీతాన్ని ఎంజాయ్ చేయడానికి 60,000 మంది హాజరయ్యారు. కానీ.. ఈ శాస్త్రవేత్తలు మాత్రం.. సంగీతం వినడానికి రాలేదు. దోమల రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చారు.

READ MORE: Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!

ఫెలిక్స్ హోల్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలోని ఈ పరిశోధనా బృందం, ఈ ఉత్సవానికి హాజరైన 500 మందిని ఎంపిక చేశారు. దోమలతో నిండిన పెట్టెలో చేతులు పెట్టమని కోరారు. ఎలాంటి భయాందోళనలకు గురవ్వకుండా వారి చేతులను రక్షిత వస్త్రంతో కప్పారు. దీని వలన దోమలు వాసన చూస్తాయి కానీ కుట్టవు. ప్రతి ప్రయోగానికి సంబంధించి వీడియో రికార్డ్ చేశారు. లోలాండ్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో నిర్వహించిన ఈ సరదా పరిశోధన నుంచి శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను కనుగొన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఎన్ని దోమలు కూర్చున్నాయో, ఎంతసేపు కూర్చున్నాయో పరిశీలించారు. దీనితో పాటు.. ఈ 500 మందికి ఒక ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అందులో వారు ఏమి తింటారు? ఏమి తాగుతారు? జీవన విధానాకి సంబంధించిన పలు పశ్నలు ఉన్నాయి. వీటన్నింటికీ వారు సమాధానాలు రాశారు.

READ MORE: Harish Rao : ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే

ఈ డేటాతో పరిశోధన చేపట్టారు. బీరు, గంజాయి వినియోగదారులను, ఎక్కువ మొత్తంలో సె**క్స్‌లో పాల్గొన్న వారిని దోమలు ఇష్టపడతాయని వెల్లడైంది! సన్‌స్క్రీన్ రాసుకున్న, తాజాగా స్నానం చేసిన వ్యక్తులపై దోమలు కుట్టేందుకు ఇష్టపడలేదు. దోమలు ఓ వ్యక్తిని కుట్టే ముందు ఎవరిని కుట్టాలో, ఎవరిని కుట్టకూడదో నిర్ణయించుకోవడానికి ముందుగా వాసన చూస్తాయి. కానీ ఇప్పటివరకు అవి ఏ వాసనను ఎక్కువగా ఇష్టపడతాయో పూర్తిగా తెలియదు. అయితే, బీరు తాగే వ్యక్తులను దోమలు ఇష్టపడతాయని పరిశోధనలో తేలింది. కాగా.. ఈ పరిశోధనపై శాస్త్రవేత్త ఫెలిక్స్ హోల్ స్పందించారు. “మద్యం తాగే వ్యక్తులు ఎక్కువ ఉత్సాహంతో నృత్యం చేస్తారు. దీని కారణంగా వారి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట వల్ల వాసన మారుతుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది.” అని స్పష్టం చేశారు.

Exit mobile version