Mediterranean Diet vs Indian Diet: భారతీయ ఆహారాన్ని మార్చాల్సిన అవసరముందా..? డైట్‌పై వైద్యుల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mediterranean Diet vs Indian Diet: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార విధానాల్లో మెడిటరేనియన్ డైట్ ఒకటి. ఫిట్నెస్ నిపుణులు, వైద్యులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఈ డైట్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తుండటంతో చాలా మంది ఆరోగ్యంగా ఉండాలంటే ఆలివ్ ఆయిల్, హమ్మస్, క్వినోవా, సాల్మన్ వంటి ఆహారాలనే తీసుకోవాలనే భావనకు వస్తున్నారు. అయితే నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ తినే పప్పు, రోటీ, కూరలను వదిలేయాలా? అనే ప్రశ్నకు వైద్య నిపుణులు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు.. అసలు ఆరోగ్యంగా ఉండేందుకు విదేశీ డైట్లను అనుసరించాల్సిన అవసరం లేదు. సమతుల్యంగా, పోషకాలు సమృద్ధిగా ఉన్న భారతీయ ఆహారాన్ని సరైన విధంగా తీసుకుంటే అదే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.
మెడిటరేనియన్ డైట్ ఎందుకు అంత ప్రసిద్ధి?
మెడిటరేనియన్ డైట్లో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు, నట్స్, గింజలు, ఆలివ్ ఆయిల్ ప్రధానంగా ఉంటాయి. అలాగే చేపలు, పాల ఉత్పత్తులను పరిమితంగా తీసుకోవాలని సూచిస్తారు. మరోవైపు ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పానీయాలు, రిఫైన్డ్ ఫుడ్స్‌ను తగ్గించాలని ఈ డైట్ సూచిస్తుంది. దశాబ్దాలుగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ డైట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలకు కారణం ఒక్క ఆహార పదార్థం కాదని, మొత్తం ఆహార విధానం సమతుల్యంగా ఉండటమే అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
భారతీయ ఆహారం కూడా అంతే ఆరోగ్యకరమా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం సాంప్రదాయ భారతీయ ఆహారం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆహారంలో పప్పులు, శనగలు, పెసర్లు, సీజనల్ కూరగాయలు, పెరుగు, చిరుధాన్యాలు, గోధుమలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు సహజంగానే ఉంటాయి. సమస్య భారతీయ ఆహారంలో లేదని, ప్రస్తుతం పెరుగుతున్న అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్స్, చక్కెర పానీయాలు, అధిక పరిమాణంలో భోజనం చేయడం, తరచూ ఫాస్ట్ ఫుడ్ తినడం, పాలిష్ చేసిన బియ్యం, మైదా పదార్థాల వినియోగం వల్లే ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రెండు డైట్లలో ఉన్న సామాన్యతలు
భారతీయ, మెడిటరేనియన్ డైట్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. రెండూ కూడా ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని సూచిస్తాయి. అలాగే తక్కువగా ప్రాసెస్ చేసిన సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా రెండింటిలో కీలక పాత్ర పోషిస్తాయి. మెడిటరేనియన్ డైట్లో ఆలివ్ ఆయిల్ ప్రధానమైతే, భారతీయ ఆహారంలో సంప్రదాయ నూనెలు, నట్స్, గింజలు, కొవ్వు అధికంగా ఉండే చేపల ద్వారా మంచి కొవ్వులను పొందవచ్చు. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, పదే పదే నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పప్పులు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, లీన్ మీట్ వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వృద్ధాప్యంలో కూడా శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.
రెండు డైట్ల మధ్య ప్రధాన తేడా ఏంటి?
మెడిటరేనియన్ డైట్లో ఆలివ్ ఆయిల్, చేపలు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం చాలామంది భారతీయుల ఆహారంలో పాలిష్ చేసిన బియ్యం, మైదా పదార్థాలు, స్వీట్లు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు అధికంగా ఉంటున్నాయి. వైద్యుల ప్రకారం, ఏ డైట్ అనుసరిస్తున్నామన్నది కంటే ఎంత తింటున్నాం, ఏ నాణ్యత కలిగిన ఆహారం తీసుకుంటున్నాం అనేదే ముఖ్యమని చెప్పారు. అధిక కేలరీలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయన వివరించారు.
వ్యాధుల నివారణకు ఏ డైట్ మంచిది?
గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించాలంటే ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తగ్గించడం, చక్కెర వినియోగాన్ని నియంత్రించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అలవాట్లను భారతీయ డైట్లోనూ, మెడిటరేనియన్ డైట్లోనూ సులభంగా పాటించవచ్చని వైద్యులు తెలిపారు.. ప్రతి ఒక్కరికీ ఒకే డైట్ సరిపోదని, తమ జీవనశైలికి, సంస్కృతికి, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలం పాటించగలిగే సమతుల్య ఆహార విధానమే ఉత్తమమని చెబుతున్నారు..
మొత్తంగా ఆరోగ్యంగా ఉండాలంటే పప్పు, రోటీ, కూరలు, పెరుగు వంటి సంప్రదాయ భారతీయ ఆహారాన్ని వదిలేయాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూరగాయల పరిమాణాన్ని పెంచడం, తగినంత ప్రోటీన్ తీసుకోవడం, సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోవడం, చక్కెర పానీయాలను తగ్గించడం, పరిమిత మోతాదులో భోజనం చేయడం వంటి చిన్న మార్పులు చేస్తే భారతీయ ఆహారమే జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడే ఉత్తమ డైట్‌గా మారుతుందని వారు సూచిస్తున్నారు. చివరికి గెలిచేది మెడిటరేనియన్ డైట్ కాదు, భారతీయ డైట్ కూడా కాదు. సమతుల్యంగా, పోషకాలు సమృద్ధిగా, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నిరంతరం తీసుకునే అలవాటే నిజమైన ఆరోగ్య రహస్యం.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..