Kitchen Sponge: ఇంట్లో వంట చేయడం ఒక ఎత్తయితే.. వండిన అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. ఈ రోజుల్లో వంట పాత్రలను శుభ్రం చేయడానికి మనం ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ లేదా స్పాంజ్‌ని ఉపయోగిస్తాము. అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బ్యాక్టీరియాను విడుదల చేస్తుందని మీరు నమ్మగలరా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఇక డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్‌లు వాటి తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్‌లో 54 బిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లా ఉండవచ్చని అధ్యాయనాల్లో వెల్లడైంది. ఇందులో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి.
Read also: Tirumala Garuda Seva: తిరుమల బ్రహ్మోత్సవాల్లో నేడు ముఖ్యమైన ఘట్టం.. భక్తులకు అలర్ట్..
ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే రకరకాల బ్యాక్టీరియా వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్‌లలో వృద్ధి చెందే ఈ-కొలి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనిని హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహారం కలుషితం కావడం వల్ల వస్తుంది. స్పాంజ్‌లలో కనిపించే మరొక వ్యాధికారక స్టెఫిలోకాకస్. చర్మ వ్యాధులు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. ఇక.. ప్లాస్టిక్ స్పాంజ్‌లను తరచుగా వాడి వాటిని పారవేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు కాబట్టి, పరిశోధకులు సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. స్పాంజ్‌లను ఉపయోగించడం అసౌకర్యంగా ఉన్నవారు స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్‌వాషర్లు వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్