శీతాకాలం రాత్రి మొఖం మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఇది చాలా సౌకర్యంగా, వెచ్చగా అనిపించినప్పటికీ, ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చాలామంది చలి నుండి రక్షణ పొందడానికి ముఖం పూర్తిగా దుప్పటితో కప్పుకుని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల శ్వాస వ్యవస్థ, గుండె, మెదడు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖం కప్పుకుంటే, మనం బయటకు వదిలే గాలి (కార్బన్ డయాక్సైడ్) దుప్పటి లోపలే చిక్కుకుపోతుంది. తదుపరి శ్వాసలో అదే CO₂ ఎక్కువగా ఉన్న గాలి మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ స్థాయి తగ్గి, మెదడు, గుండెపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది.
ఇలా ముఖం కప్పుకొని నిద్రపోవడం వల్ల ఉదయాన్నే తలనొప్పి, అలసట, నోరు ఎండిపోవడం, గాఢ నిద్రకు లోబడలపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, దీని వల్ల రక్తపోటు, హృదయ స్పందనపై ప్రతికూల ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. దుప్పటి లోపల నోటి తేమ పేరుకుపోవడం వల్ల వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఇది బూజు పెరుగుదలకు, అలెర్జీలు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు అనుకూలంగా ఉంటుంది.
డాక్టర్లు సూచిస్తున్నారెందంటే, ముఖం పూర్తిగా కప్పుకోవడం కంటే ఈ పద్ధతులు పాటించడం మంచిది. చలిని తగ్గించుకోవడానికి వెచ్చని దుస్తులు, టోపీ, సాక్స్ ధరించడం ద్వారా శరీర వేడి ఎక్కువగా తల, కాళ్ల ద్వారా బయటకు వెళ్లి శరీరాన్ని సురక్షితంగా ఉంచవచ్చు. దుప్పటిని మెడ వరకు మాత్రమే ఉంచి, ముఖానికి దూరంగా ఉంచడం శ్వాసకు మంచిది.
మీరు హీటర్ వాడినట్లయితే, గది వేడెక్కిన తరువాత హీటర్‌ను తప్పనిసరిగా ఆపడం అవసరం. చలిని తగ్గించుకోవడానికి ముఖం కప్పుకోవడం ప్రమాదకరమని, ఇది ఆక్సిజన్ కొరత, CO₂ పెరుగుదలకు దారితీసి గుండె, మెదడు, శ్వాసకోశంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖాన్ని కప్పకుండా, సరైన పద్ధతుల్లో వేడి కాపాడితే మాత్రమే సురక్షితమైన, ఆరోగ్యకరమైన నిద్ర పొందవచ్చు.
ఈ సమాచారం ఇంటర్నెట్ వనరుల నుండి సేకరించబడింది. మీకు ఏమైనా ఆరోగ్య సంబంధిత సందేహాలు ఉంటే, ప్రత్యేక వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
