How to Remove Shoe Odour: షూ నుంచి వచ్చే వాసన చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంది.. చాలా సందర్భాల్లో కార్యాలయాల్లో.. పని చేసే ప్రాంతాల్లోనూ ఇది తీవ్ర సమస్యగా మారుతుంది.. అయితే, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు షూస్ శుభ్రంగా ఉంటాయి. కానీ, రోజులు గడిచే కొద్దీ దుమ్ము, ధూళి, చెమట కారణంగా వాటిలో దుర్వాసన ఏర్పడుతుంది. ముఖ్యంగా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు షూస్ నుంచి వచ్చే దుర్వాసన చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
చాలామంది షూస్ నుంచి దుర్వాసన వస్తే వెంటనే వాటిని ఉతకాల్సిందే అనుకుంటారు. కానీ, తరచూ షూస్ కడగడం అంత సులువు కాదు. శీతాకాలంలో అవి త్వరగా ఆరవు. పైగా కొన్ని రకాల షూస్‌ను పదేపదే ఉతకడం వల్ల వాటి మెరుపు తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉతకకుండానే షూస్ దుర్వాసనను తొలగించే కొన్ని సులభమైన చిట్కాలు ఇవే.. అసలు, షూస్ దుర్వాసనను వదిలించుకునే సులభమైన మార్గాలు ఏంటో చూద్దాం..
* బేకింగ్ సోడా
– షూస్‌లో దుర్వాసనకు ప్రధాన కారణం చెమట, బ్యాక్టీరియా. బేకింగ్ సోడా వీటిని గ్రహించి వాసనను తగ్గిస్తుంది.
– రాత్రిపూట షూస్‌లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఉంచండి.
– ఉదయం బ్రష్‌తో శుభ్రం చేయండి.
– దుర్వాసన గణనీయంగా తగ్గుతుంది.
* టీ బ్యాగులు
– టీ తాగిన తర్వాత వాడిన టీ బ్యాగ్‌ను పారేయకండి.
– చల్లబడిన టీ బ్యాగ్‌ను షూస్‌లో ఉంచండి.
– టీ బ్యాగ్‌లోని సహజ గుణాలు బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను గ్రహిస్తాయి.
– కొన్ని గంటల తర్వాత షూస్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
* రోజూ సాక్స్ మార్చడం
– చాలా సందర్భాల్లో షూస్ దుర్వాసనకు కారణం సాక్స్‌లో చేరిన చెమట.
– ప్రతిరోజూ శుభ్రమైన సాక్స్ ధరించాలి.
– ఒకే సాక్స్‌ను వరుసగా రోజులు ఉపయోగించకూడదు.
– ఇలా చేస్తే షూస్‌లో వాసన వచ్చే సమస్య సహజంగానే తగ్గుతుంది.
* ఇంకా ఉపయోగకరమైన చిట్కాలు
రాత్రంతా షూస్‌లో బేకింగ్ సోడా ఉంచి ఉదయం తుడవడం వల్ల వాసన తటస్థీకరించబడుతుంది. కాటన్ బాల్ లేదా గుడ్డపై టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి షూస్‌లో ఉంచండి. ఇది మంచి వాసనతో పాటు బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుంది. షూస్‌ను రోజులో కొంతసేపు సూర్యరశ్మి, గాలికి ఉంచడం వల్ల తేమ, దుర్వాసన రెండూ తగ్గుతాయి.
