Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bed Bugs: సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్ నల్లులు. అవును ఉదయం అంతా ఆఫీస్ పనుల్లో అలిసిసొలసి ఇంటికి వచ్చి రాత్రికి బెడ్‌పైన పడుకొని కాస్త రిలాక్స్ అవుదామని అనుకుంటే ఈ బెడ్ బగ్స్ మనుషుల రక్తాన్ని నీళ్లు తాగినట్లు తాగి ప్రాణాలు తీస్తున్నాయని చాలా మంది నుంచి వచ్చే రొటీన్ కంప్లైంట్స్ మనం నిత్యం వింటూనే ఉంటాం. అవును ఇంతకీ మీ ఇంట్లో నల్లులు ఉన్నాయా .. ఉంటే ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఇవి చూస్తూ చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోతాయి. మంచాలు, దిండ్లు, పరుపులు, సోఫాలు, కుర్చీలు.. ఆఖరికి మనం వేసుకునే బట్టలలో కూడా ఇవి గూడు కట్టుకుంటాయి. పగటిపూట మన కంటికి కనిపించకుండా దాక్కునే ఈ చిన్న కీటకాలు, రాత్రి కాగానే నిద్రపోనివ్వకుండా రక్తాన్ని పీల్చేస్తాయి. చాలామంది వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్ వల్ల కొన్నిసార్లు నల్లులు చావకపోగా, మన ఆరోగ్యానికి మాత్రం లెక్కలేనన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పైసా ఖర్చుతో పని లేకుండా సింపుల్‌గా నల్లులను శాశ్వతంగా ఎలా వదిలించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నల్లులు ఎక్కడ దాక్కుంటాయి..
నల్లులు అనేవి చిన్న ఎరుపు-గోధుమ రంగులో ఉండే కీటకాలు. ఇవి చాలా సన్నని శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి పరుపుల అంచులు, మంచాల ఫ్రేములు, హెడ్బోర్డులు, చెక్క ఫర్నిచర్ సందులు వంటి అతి చిన్న ప్రదేశాలలో కూడా సులభంగా దూరి దాక్కోగలవు. నిజానికి ఇవి వేగంగా సంతానోత్పత్తి చేస్తాయి.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
నల్లులను తరిమికొట్టే సహజమైన చిట్కాలు ఇవే..
నల్లులు వేపలో ఉండే చేదు గుణాన్ని, దాని ఘాటైన వాసనను అస్సలు తట్టుకోలేవు. మంచం పగుళ్లు, సందులలో వేప నూనెను పూర్తిగా రాయడం వల్ల నల్లులు వెంటనే పారిపోతాయి. లేదా ఎండిన వేప ఆకులను పరుపుల కింద, మంచం మీద పరచుకుంటే వాటి సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే మంచం లేదా సోఫా మూలల్లో కర్పూరం పొడిని చల్లితే.. వాటి నుంచి వచ్చే ఘాటైన వాసనకు నల్లులు ఊపిరాడక చనిపోవడం లేదా ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవడం చేస్తాయని చెబుతున్నారు.
దిండ్లు, పరుపులు, మ్యాట్రెస్లలో నల్లులు ఎక్కువగా ఉంటే.. వాటిని కనీసం ఒక రోజంతా ఎండలో ఉంచాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆ వేడికి నల్లులు మాత్రమే కాకుండా, వాటి గుడ్లు కూడా పూర్తిగా నశించిపోతాయని పేర్కొంటున్నారు. అలాగే పసుపు, వేప ఆకులను కలిపి నూరి ముద్దగా చేసుకొని దానిని నల్లులు ఎక్కువగా ఉన్న ఫర్నిచర్ సందులలో లేదా మంచం పగుళ్లలో రాయాలని చెబతుున్నారు. పసుపులోని యాంటీ సెప్టిక్ గుణాలు, వేప ఘాటు కలిసి నల్లులను సమర్థవంతంగా అరికడతాయని చెబుతున్నారు. నల్లుల బెడద మరీ ఎక్కువగా ఉంటే, అప్పుడప్పుడు ఫర్నిచర్ కీళ్లపై కిరోసిన్ చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
నల్లులు కుడితే వచ్చే సమస్యలు ఇవే..
నల్లులు కుట్టడం వల్ల నిద్రకు భంగం కలగడమే కాకుండా, మనశ్శాంతి కూడా దెబ్బతింటుంది. ఇవి కుట్టినప్పుడు చేతులు, కాళ్లు, మెడ, ముఖం వంటి చర్మ భాగాలపై ఎర్రటి, తీవ్రమైన దురదతో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. నల్లులు గోడల ద్వారా ఒక చోటు నుంచి మరోచోటుకి పాకకుండా ఉండాలంటే.. ఇంట్లోని మంచాలు లేదా సోఫాలను గోడకు తాకకుండా, కాస్త దూరంగా జరిపి ఉంచాలి. ఈ చిన్నపాటి ఇంటి చిట్కాలను పాటిస్తే కెమికల్స్ వాడకుండానే నల్లుల సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!