Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Poha Upma: సాధారణంగా మనం ఇళ్లలో తెల్ల అటుకులతో ఉప్మా లేదా పోహా చేసుకుంటూ ఉంటాము. కానీ తెల్ల అటుకులతో పోలిస్తే ఎర్ర అటుకులలో పోషక విలువలు చాలా ఎక్కువ. వీటిని పెద్దగా ప్రాసెస్ చేయరు కాబట్టి, ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎర్ర అటుకులతో రుచికరమైన ఉప్మాను ఎలా తయారు చేయాలో, అలాగే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ఎర్ర అటుకులు – 2 కప్పులు
నెయ్యి లేదా నూనె – 3 నుంచి 4 స్పూన్లు
జీలకర్ర – అర స్పూన్
శనగపప్పు – 1 స్పూన్
పల్లీలు – 2 స్పూన్లు (కావాలనుకుంటే మరికొన్ని వేసుకోవచ్చు)
ఆలుగడ్డ (బంగాళాదుంప) – 1 చిన్నది (చిన్న ముక్కలుగా కోసినవి)
ఉల్లిపాయ – 1 చిన్నది (ముక్కలుగా కోసినవి)
పచ్చిమిర్చి – 1 (చిన్న ముక్కలుగా కోసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – తగినంత
నిమ్మకాయ – రుచి కోసం (ఆప్షనల్)
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల ఎర్ర అటుకులను తీసుకోవాలి. అవి మునిగేంత వరకు మాత్రమే నీటిని పోసి, కేవలం 5 నుంచి 7 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువ సమయం నానబెడితే అవి మరీ మెత్తగా అయిపోయి ముద్దలా మారుతాయి, కాబట్టి తక్కువ సమయం మాత్రమే నానబెట్టడం ముఖ్యం. తర్వాత ఒక చిన్న పాన్ లేదా కుక్కర్లో 3 – 4 స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత శనగపప్పు, పల్లీలు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
వేగిన పప్పులలో చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆలు ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆపై సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి పోపునంతటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ను లో-ఫ్లేమ్‌లో ఉంచి, ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎర్ర అటుకులను ఈ పోపులో వేసి, పోపు అంతా అటుకులకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి ఎర్ర అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దీనిపై కొద్దిగా నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఎర్ర అటుకులను బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా లంచ్ లేదా ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారంగా పని చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో ఈ ఎర్ర అటుకులను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో శరీరానికి కావలసిన ఎన్నో రకాల ఖనిజ లవణాలతో పాటు విటమిన్ – బి సమృద్ధిగా లభిస్తుంది.
ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లుగా అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక ఉత్తమమైన ఆహారంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఎర్ర అటుకుల ఉప్మాను మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకోడానికి ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!