జనాలు ఆహారం విషయం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అవి తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పే అవుతుంది.. ఈ మధ్య చపాతీలకు బదులుగా చాలా మంది పరోటాలను తింటున్నారు..రుచి బాగుంది కదూ అని అందరు ఇష్టంగా తింటారు.. పరోటాలను మైదా తో చేస్తారన్న సంగతి తెలిసిందే.. మైదాను ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువ మందికి మధుమేహం రావడానికి కారణం పరోటా అని తాజా అధ్యాయానాల్లో తేలింది..
ఉత్తర భారత దేశం కంటే దక్షిణ భారత దేశంలోని పలు హోటళ్లలో పరోటా డిష్ తప్పనిసరిగా వుంటుంది. వీటిని ఇష్టపడి తినే వారే అధికం. పరోటాలో మానవులకు మధుమేహ వ్యాధి ఏర్పడటానికి అవసరమైన 70 శాతం ఆహార పదార్థాలు ఇందులో వున్నాయని పరిశోధనలో తేలింది. అంతేగాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతూ, కిడ్నీని దెబ్బతీసే పరోటాలను తీసుకోకపోవడమే మంచిదని.. ఇది క్యాన్సర్ కు కూడా దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
మైదా పిండి తయారీలో ఉపయోగించే బ్రోమైట్ శరీరానికి ఎంతో హాని చేస్తుంది. గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగించే మైదాపిండి ఒక రకంగా స్లో పాయిజన్ అని చెప్పవచ్చు. మైదా తింటే కొన్ని కీటకాలు ప్రాణాలు కోల్పోతాయంటే మైదా తినడం వల్ల శరీరానికి ఏ స్థాయి లో హాని కలుగుతుందో సులువుగానే అర్థమవుతుంది. హల్వాలు, బొబ్బట్లు, పరోటా,బ్రెడ్ కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.. సో పరోటా ప్రియులు జాగ్రత్త…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.