ఎప్పుడో అప్పుడు కోపం రావటం సహజమే. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు సజావుగా లేకపోయినా.. మనస్పర్ధలు తలెత్తినా ఆగ్రహావేశాలకు లోనుకావటం, తిరిగి మామూలుగా అవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచూ ఆగ్రహానికి గురవుతున్నా, ఇది రోజువారీ వ్యవహారాలను దెబ్బతీస్తున్నా జాగ్రత్త పడాల్సిందే. ఇందుకు కొన్ని జబ్బులు కూడా కారణం కావొచ్చు. వీటి గురించి తెలుసుకొని ఉంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటానికి వీలుంటుంది. కోపం చాలా ప్రమాదకరం. కోపం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: China Piece: ఆసక్తికరంగా ‘చైనా పీస్’ టీజర్
కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా రకరకాల సమస్యలు వస్తాయి. కోపం వల్ల పునరుత్పత్తి శక్తి కూడా తగ్గుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. కోపం ఎక్కువగా రావడం వల్ల సమర్ధవంతంగా ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మనలోని సృజనాత్మకత, ఆనందం రెండూ తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి విపరీతమైన కోపం మనుషుల్ని పక్షవాతం బారిన, బ్రెయిన్ స్ట్రోక్ ల బారిన పడేస్తుంది.
READ MORE: Can You Eat Snake Eggs: పాము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది..?
కోపం తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాలి.. కోపం వచ్చినప్పుడు కాసేపు ప్రశాంతంగా నడవాలి. మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్కపెట్టాలి. బాగా ఇష్టమైన ప్రశాంతమైన సంగీతం వినాలి. దాంతో మెదడుపై ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఆపేయాలి. కంటి నిండా నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి. సాధ్యమైతే నృత్యం చేయాలి, గంతులు వేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి. పుస్తక పఠనం, చిత్రలేఖనంతోనూ మనసును ప్రశాంతపరచుకోవచ్చు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. .
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
